గూగుల్‌పే, జీమెయిల్‌ క్రాష్‌ అవుతోందా? ఇలా చేయండి!

23 Mar, 2021 14:35 IST|Sakshi

యాప్‌ క్రాష్‌ అయిందని అకస్మాత్తుగా నోటిఫికేషన్లు

క్రాష్‌లో గూగుల్‌పే, జీ మెయిల్‌, క్రోమ్‌లు కూడా

అత్యవసరమైతే జీ మెయిల్‌ డెస్క్ టాప్‌ వర్షన్‌ వాడండి!

గత కొన్నిరోజులుగా ఆండ్రాయిడ్‌ వినియోగదారులకు యాప్‌ క్రాష్‌ అయిందని అకస్మాత్తుగా నోటిఫికేషన్లు వస్తోండంతో వినియోగదారులు నిర్ఘాంతపోతున్నారు. ఫలానా యాప్‌కు చెందిన నోటిఫికేషన్‌ను క్లిక్‌ చేసినప్పుడు  యాప్‌ ఓపెన్‌ అవ్వడంలేదు. తరుచుగా క్రాష్‌ అవుతున్న యాప్స్‌లో గూగుల్‌పే, జీ మెయిల్‌, క్రోమ్‌ కూడా ఉన్నాయి. ఈ సమస్యకు గల కారణాన్ని గూగుల్‌ వెంటనే పసిగట్టింది. ఈ సమస్య వోఎస్‌లోని ఆండ్రాయిడ్‌ వెబ్‌ వ్యూ యాప్‌ ద్వారా ఏర్పడిందని గూగుల్‌ తెలిపింది.

కొంతమంది వినియోగదారులకు జీ-మెయిల్‌ యాప్ పనిచేయడంలేదనే విషయం కంపెనీ దృష్టికి వచ్చిందని గూగుల్‌ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. తొందరలోనే సమస్యను పరిష్కారిస్తా మన్నారు. అంతేకాకుండా ఈ సమస్యను ఎదుర్కొంటున్నవారు అత్యవసర సేవల కోసం ఫోన్‌లోని  జీమెయిల్‌ యాప్‌కు బదులుగా డెస్క్ టాప్‌ వెబ్‌ ఇంటర్‌ఫేజ్‌ను వాడమని పేర్కొన్నారు. కాగా, యాప్‌ క్రాష్‌ సమస్యను ఎదుర్కొంటున్న వినియోగదారులు అత్యధికంగా ఉన్నారు.

ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ కలిగిన మొబైల్‌ ఫోన్లనే ఎక్కువశాతం వినియోగదారులు వాడుతున్నారు. ఫలానా బ్రాండ్‌ అనే తేడా లేకుండా అన్ని ఆండ్రాయిడ్‌ మొబైల్‌ఫోన్లలో ఈ సమస్య ఏర్పడింది. ముఖ్యంగా శాంసంగ్‌ ఫోన్లు ఎక్కువగా యాప్‌ క్రాష్‌ సమస్యకు గురైయ్యాయి. ఈ సమస్య మరింత జటిలం కావడంతో శాంసంగ్‌ తన యూజర్లను వెబ్‌ వ్యూ యాప్‌ను ఆన్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని సూచించింది.

ఈ విధంగా చేస్తే యాప్‌ క్రాష్‌ అవ్వదు..!
ఈ సమస్య పరిష్కారం కోసం శాంసంగ్‌ సపోర్ట్‌  పలు సూచనలు చేసింది.  వెబ్‌వ్యూ ఆప్‌డేట్‌ను ఆన్‌ఇన్‌స్టాల్‌ చేసి, తిరిగి ఫోన్‌ను స్విచ్‌ ఆఫ్‌ చేసి స్విచ్‌ ఆన్‌ చేయమంది. తరువాత ఈ స్టెప్‌లను ఫాలో అవ్వండి.

సెట్టింగ్స్‌లోకి వెళ్లి.. అక్కడ  యాప్స్‌ అనే ఆప్షన్‌ ఎంచుకోవాలి.  పక్కన కనిపించే త్రీ డాట్స్‌ను క్లిక్‌ చేసి  షో సిస్టమ్‌ యాప్స్‌ లో  ఆండ్రాయిడ్‌ సిస్టమ్ వెబ్‌వ్యూ లోకి వెళ్లి..అన్‌ఇన్‌స్టాల్ ఆప్‌డేట్స్‌ను‌ సెలక్ట్‌ చేసుకోవాలి. శాంసంగ్‌  యూజర్లు  మాత్రమే కాకుండా అన్ని ఆండ్రాయిడ్‌ మొబైల్‌ యూజర్లు ఈ విధంగా చేస్తే యాప్‌ క్రాష్‌ సమస్యనుంచి తప్పించుకోవచ్చు.  అయితే వెబ్‌వ్యూ యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్‌ చేసేటప్పుడు  అప్రమత్తత అవసరమని  కూడా హెచ్చరించింది.

(చదవండి: ఐటెల్‌ ఆండ్రాయిడ్‌ టీవీలు వచ్చేశాయ్‌!)

మరిన్ని వార్తలు