మీరు ఈ యాప్స్‌ వినియోగిస్తున్నారా? వెంటనే డిలీట్‌ చేయండి.. లేదంటే

29 Apr, 2023 15:42 IST|Sakshi

మిలియన్ల మంది యూజర్లు వినియోగిస్తున్న 19 రకాల ప్రమాదకరమైన యాప్స్‌ను వెంటనే డిలీట్‌ చేయాలని సైబర్‌ టెక్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. లేదంటే ఆ యాప్స్‌ మీ ఫోన్‌లలోని సున‍్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించే అవకాశం ఉందని సూచిస్తున్నారు. 

మాల్వేర్‌ ఫాక్స్‌ నివేదిక ప్రకారం.. గత పదేళ్లలో సైబర్‌ కేటుగాళ్లు ఆండ్రాయిడ్‌ ఫోన్‌లను ఆసరగా చేసుకొని పలు వైరస్‌ల సాయంతో యూజర్ల వ్యక్తిగత డేటాను సేకరిస్తున్నట్లు తెలిపింది. ఇందుకోసం నేరస్తులు హార్లీ ట్రోజన్, జోకర్ స్పైవేర్, ఆటోలైకోస్ మాల్వేర్‌లను ఉపయోగిస్తున్నారు. 

మాల్‌వేర్‌ను ఎలా పంపిస్తారు
పైన పేర్కొన్న మాల్‌వేర్‌లను వినియోగదారులు సర్వసాధారణంగా వినియోగించే యాప్‌లలోకి వైరస్‌ను పంపిస్తారు. అనంతరం వారికి కావాల్సిన డేటాను కలెక్ట్‌ చేసుకొని డార్క్‌వెబ్‌లో అమ్ముకుంటున్నట్లు పేర్కొంది. ఇక మాల్వేర్‌ ఫాక్స్‌ నిర్ధారించిన 19 యాప్స్‌లలో ఇవి ఉన్నాయి. ఆ యాప్స్‌ మీ ఫోన్‌లలో ఉంటే డిలీట్‌ చేయాలని విడుదల చేసిన రిపోర్ట్‌లో నివేదించింది.     

హార్లీ ట్రోజన్ - ఫేర్‌ గేమ్‌ హబ్‌ అండ్‌ బాక్స్‌, హోప్‌ కెమెరా- పిక్చర్‌ రికార్డ్‌, సేమ్‌ లాంచర్‌, లైవ్‌ వాల్‌ పేపర్‌, అమేజింగ్‌ వాల్‌ పేపర్‌, కూల్‌ ఎమోజీ ఎడిటర్‌ అండ్‌ స్టైకర్‌ 

జోకర్‌ స్పైవేర్‌ - సింపుల్‌ నోట్‌ స్కానర్‌, యూనివర్సల్‌ పీడీఎఫ్‌ స్కానర్‌, ప్రైవేట్‌ మెసేంజర్‌, ప్రీమియం ఎస్‌ఎంఎస్‌, బ్లడ్‌ ప్రజర్‌ చకర్‌, కూల్‌ కీబోర్డ్‌, పెయింట్‌ ఆర్ట్, కలర్‌ మెసేజ్‌

ఆటోలీ కాస్‌ మాల్వేర్‌- వ్వాల్గ్‌ స్టార్‌ వీడియో ఎడిటర్‌, క్రియేటీవ్‌ 3డీ లాంచర్‌, వావ్‌ బ్యూటీ కెమెరా, జిఫ్‌ ఎమోజీ కీబోర్డ్‌, ఇన్‌స్టంట్‌ హార్ట్‌రేట్‌ ఎనీటైమ్‌ వంటి యాప్స్‌ ఉన్నాయి. వీటిని డౌన్‌లోడ్‌ చేసుకోవద్దని టెక్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చదవండి👉 అద్దె ఇంట్లో ఉంటే ఒరిగేదేమీ లేదు.. సొంతిల్లు ఇప్పుడే కొనేయండహో..

మరిన్ని వార్తలు