Gmail Rolling New Feature: యూజర్లకు భారీ ఊరట..! జీ-మెయిల్‌లో ఆ సమస్యకు చెక్‌పెట్టనున్న గూగుల్‌..!

26 Sep, 2021 19:02 IST|Sakshi

Gmail Rolling New Feature: నేటి టెక్నాలజీ యుగంలో ఉత్తరాలు, ఇన్‌ల్యాడ్ లెటర్స్‌ పూర్తిగా మరుగనపడిపోయాయి. వాటిస్ధానంలో జీ-మెయిల్‌ పూర్తిగా భర్తీ చేసింది. పలు కార్పోరేట్‌ కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలు, పలు సేవలను అందించే యాప్స్‌ కూడా పూర్తిగా మెయిల్స్‌తోనే ప్రత్యుత్తరాలను జరుపుతున్నాయి. మనలో చాలా మంది జీ-మెయిల్‌ సేవలను వాడుతున్న వాళ్లమే...!
చదవండి: మొండి గూగుల్‌.. ఆ ఫోన్లలో కరెక్ట్‌ పాస్‌వర్డ్‌ కొట్టినా వేస్టే! ఎందుకంటే..

జీ-మెయిల్‌ను మెరుగుపర్చడం కోసం పలు ఫీచర్స్‌తో గూగుల్‌ ఎ‍ప్పటికప్పుడు ముందుకు వస్తోంది. కొద్ది రోజుల క్రితం జీ-మెయిల్‌ యాప్‌లో గూగుల్‌మీట్‌ వాయిస్‌ కాలింగ్‌ ఫీచర్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ ఫీచర్‌తో జీ-మెయిల్‌తో నేరుగా గూగుల్‌ మీట్‌ యాప్‌ లేకుండానే పాల్గొనే సదుపాయాన్ని గూగుల్‌ తన యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. తాజాగా జీ-మెయిల్‌లో మరో సూపర్‌ ఫీచర్‌ను గూగుల్‌ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది.  

సెర్చ్‌చేయడం మరింత సులువు..!
మనకు కావాల్సిన ఫలానా ఈ-మెయిల్‌ను వెతకడం కోసం ఏం చేస్తాం..! సింపుల్‌గా జీ-మెయిల్‌లో మనకు కావాల్సిన దాని గురించి సెర్చ్‌ బటన్‌పై క్లిక్‌ చేస్తే.. మనకు ఆయా అంశానికి సంబంధించిన  సజెషన్స్‌ను జీ-మెయిల్‌ చూపిస్తోంది. ఇక్కడ సరైన టర్మ్‌తో వెతికినా, ఒక వేళ నిర్థిష్టమైన మెయిల్‌తో వెతికితే మనకు వెంటనే సెర్చ్‌ రిజల్ట్స్‌ను కన్పిస్తాయి. ఒకవేళ సజెషన్స్‌ ఒక పది, ఇరవై ఉంటే ఒకే..!కానీ.. మనం సెర్చ్‌ చేసే అంశం కొన్ని వందలుంటే మాత్రం మనకు చికాకు పక్కగా  వస్తోంది.

మనలో చాలా మంది ఈ సమస్యను ఎదుర్కోన్న వారిమే. ఈ సమస్యకు చెక్‌ పెడుతూ గూగుల్‌ సరికొత్తగా సెర్చ్‌ చేసే సమయంలో పలు ఫిల్టర్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫిల్టర్ల సహయంతో మనకు కావాల్సిన అంశం తొందరగా దొరికే ఛాన్స్ ఉంది. సెర్చ్‌ ఇన్‌ మెయిల్స్‌లో భాగంగా గూగుల్‌ త్వరలోనే ‘ఫ్రమ్‌’, ‘సెంట్‌ టూ’, ‘డేట్‌’ , ‘అటాచ్‌మెంట్‌’ అనే ఫిల్టర్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ సూపర్‌ఫీచర్‌ వచ్చే నెలలో ఆండ్రాయిడ్‌ యూజర్లకు అందరికి అందుబాటులోకి వస్తోందని తెలుస్తోంది.  
చదవండి: Forgotten Password: పాస్‌వర్డ్‌ మరిచిపోవడంతో... పది లక్షల కోట్ల రూపాయలు ఆగం...!

>
మరిన్ని వార్తలు