మా దగ్గర డబ్బులు తీసుకుని.. మా ఇబ్బందులు పట్టించుకోరా ?

25 Apr, 2022 18:23 IST|Sakshi

ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ మార్కెట్‌కి కొత్త ఊపు తీసుకొచ్చిన బ్రాండ్‌గా ఓలాకు తిరుగులేని గుర్తింపు ఉంది. ఈ స్కూటర్‌ సొంతం చేసుకోవాలని లక్షల మంది కలలుకన్నారు. ఓలా స్కూటర్‌ కోసం ఫ్రీగా మౌత్‌ పబ్లిసిటీ కూడా చేశారు. ఇదే సమయంలో తమ ఇబ్బందులు పట్టించుకోకపోతే ఆగ్రహం కూడా అదే స్థాయిలో కస్టమర్లు కూడా చూపిస్తారు. 

మూడు రోజుల మురిపెం
మహారాష్ట్రలోని బీద్‌ జిల్లాలోని పర్లికి చెందిన సచిన్‌ గిట్టే అనే వ్యాపారి 2021 సెప్టెంబరులో ఓలా స్కూటర్‌ను  ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్నారు. దాదాపు ఆరు నెలల నిరీక్షణ తర్వాత 2022 మార్చి 26న అతనింటికి ఓలా స్కూటర్‌ డెలివరీ అయ్యింది. నాలుగు రోజుల పాటు బాగానే నడిచిన స్కూటర్‌ ఆ తర్వాత ముందుకెళ్లనంటూ మొరాయించడం మొదలెట్టింది.

కస్టమర్‌ కేర్‌ నిర్లక్ష్యం
తన స్కూటర్‌కి వచ్చిన సమస్యను పరిష్కరించాలంటూ అనేక సార్లు కస్టమర్‌ కేర్‌ను సంప్రదించడు సచిన్‌ గిట్టే. ఒకసారి మెకానిక్‌ వచ్చి చూసి వెళ్లాడు కూడా. అయినా స్కూటర్‌లో తలెత్తిన సమస్య పరిష్కారం కాలేదు. దీంతో మళ్లీ కస్టమర్‌ కేర్‌ను సంప్రదిస్తే ఇసారి అటునుంచి సరైన సమాధానం లభించకపోగా కఠువైన మాటలు వినాల్సి వచ్చింది.

వినూత్న నిరసన
నాణ్యత పాటించకుండ స్కూటర్‌ తయారు చేయడమే కాకుండా లక్ష రూపాయలు వెచ్చించిన కొనుగోలుదారుడి హక్కులను గుర్తించకపోవడంతో సచిన్‌ గిట్టే మనస్తాపం చెందాడు. దీంతో ఓలా స్కూటర్‌ తయారీదారులకు ప్రత్యేక పద్దతిలో నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించుకున్నాడు. 

గాడిదతో
2022 మార్చి 24న ఓలా స్కూటరకు తాళ్లు కట్టాడు. ఆ తాళ్ల మరో చివర ఓ గాడిదకు కట్టాడు. ముందు గాడిద నడుస్తుంటే వెనుకాలే స్కూటర్‌ను తోసుకుంటూ పర్లీ పట్టణ వీధుల్లో నిరసన క్యాక్రమం చేపట్టాడు. ఇప్పటికే ఎలక్ట్రిక్‌ బైకులు కాలిపోతున్న ఘటనలు వరుసగా వెలుగు చూస్తున్న క్రమంలో ఈ వినూత్న నిరసన ప్రజల కంట పడింది. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక్క రోజు వ్యవధిలోనే ట్రెండింగ్‌ వార్తగా మారిపోయింది.

చదవండి: Ola Electric: అగ్ని ప్రమాదాల కలకలం...ఓలా ఎలక్ట్రిక్‌ కీలక నిర్ణయం..!

A post shared by LetsUpp Marathi (@letsupp.marathi)

మరిన్ని వార్తలు