కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త..!

5 Dec, 2021 12:53 IST|Sakshi

Latest News On Central Government Employees Salary Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్‌ (డీఏ)ను ఇటీవల పెంచిన తర్వాత, వారి జీతం రూ.95,000 పెరిగినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈఏడాది జూలై 1 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ)లో 28 శాతం పెంచింది. ఆ తర్వాత ఆ డీఏ నుంచి 28శాతం నుంచి 31శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.    

పే గ్రేడ్ ప్రకారం జీతం పెరుగుతుంది

ఉద్యోగుల బేసిక్ పే, గ్రేడ్ ప్రకారం వారి జీతం పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాల్సి ఉంటుంది. ఇప్పుడు, డీఏ పెరిగిన తరువాత జీతం పెరగాల్సి ఉంటుంది. ఇక కేంద్రం నిర్ణయంతో 47.14 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు 68.62 లక్షల మంది పెన్షనర్‌లకు డియర్‌నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్ పెంపుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. 

7వ పే కమిషన్ సిఫార్సు ప్రకారం, లెవెల్ 1 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి జీతం రూ. 18000 నుండి రూ. 56900 వరకు ఉంటుంది. రూ. 18000 జీతం ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి వార్షిక జీతం రూ. 30,240 పెరుగుతుంది. 

మినిమం బేసిక్‌ శాలరీ  

ఉద్యోగి ప్రాథమిక వేతనం రూ. 18,000

కొత్త డియర్‌నెస్ అలవెన్స్ (31%) రూ. 5580/నెలకు

డియర్నెస్ అలవెన్స్ ఇప్పటివరకు (17%) రూ. 3060/నెలకు

ఎంత కరువు భత్యం పెరిగింది 5580-3060 = రూ 2520/నెలకు

వార్షిక జీతం పెరుగుదల 2520X12 = రూ. 30,240

మ్యాగ్జిమం బేసిక్‌ శాలరీ

ఉద్యోగి ప్రాథమిక వేతనం: రూ. 56900

కొత్త డియర్‌నెస్ అలవెన్స్ (31%) రూ 17639 / నెల

డియర్నెస్ అలవెన్స్ ఇప్పటివరకు (17%) రూ. 9673 / నెల

డియర్‌నెస్ అలవెన్స్ ఎంత పెరిగింది 17639-9673 = రూ 7966 / నెల

వార్షిక వేతనం పెరుగుదల 7966X12 = రూ. 95,592

31% డియర్‌నెస్ అలవెన్స్ ప్రకారం, రూ. 56900 బేసిక్ జీతంపై మొత్తం వార్షిక డియర్‌నెస్ అలవెన్స్ రూ. 211,668. కానీ వ్యత్యాసం గురించి మాట్లాడితే, జీతంలో వార్షిక పెరుగుదల రూ. 95,592 పెరుగుతోంది.

చదవండి : పీఎఫ్‌ఓ రూల్స్‌ మారాయ్‌, ఈపీఎఫ్‌ అకౌంట్‌తో రూ.7లక్షల వరకు బెన్‌ఫిట్స్‌..!

మరిన్ని వార్తలు