ఆ కాలుష్యానికి ఆనంద్ మహీంద్ర పరిష్కారం

14 Oct, 2020 17:10 IST|Sakshi

ఇలాంటి వాటికి నిజమైన ప్రాధాన్యం  ఇవ్వాలి: ఆనంద్ మహీంద్ర

సాక్షి, ముంబై: పారిశ్రామిక వేత్త ,మహీంద్రా గ్రూప్ చైర్మన్ అనంద్  మహీంద్ర  మరో ఆసక్తికరమైన విషయాన్ని ట్విటర్ లో షేర్ చేశారు.  వేసవి పంటల నుండి ఉత్పన్నమయ్యే వ్యర్థాలను పారవేసే చౌకైన ,పర్యావరణ అనుకూలమైన మార్గాన్ని ట్వీట్ చేశారు. మహీంద్రా అనుబంధ సంస్థ స్వరాజ్ ట్రాక్టర్స్ రూపొందించిన ట్రాక్టర్ గురించి తాజాగా ఒక వీడియోను షేర్  చేశారు. కాలుష్య స్థాయిలను తగ్గించడానికి సూపర్ ప్లాంటర్ వాడాలన్నారు. ఇలాంటి యంత్రం రూపకల్పనకు నిజమైన ప్రాధాన్యత ఇస్తూ.. చురుకుగా ఉండాలంటూ వ్యవసాయరంగ ఉత్పత్తుల విభాగం అధ్యక్షుడు హేమంత్ సిక్కాకు ట్యాగ్ చేశారు. దీనికి సిక్కా సానుకూలంగా స్పందించారు.  

స్వరాజ్ షేర్ చేసిన ట్వీట్ ప్రకారం, గడ్డి కాల్చివేతతో వస్తున్న పొగ లాంటి సమస్యలకు ఈ ట్రాక్టర్ మంచి పరిష్కారం. ఇది పొలంలో మిగిలిని మొండి వ్యర్థాలను తిరిగి మట్టిలో కలపడానికి సహాయపడుతుందని స్వరాజ్ తెలిపింది.  "సూపర్ సీడర్ విత్ స్వరాజ్ 963 ఎఫ్ఈ ట్రాక్టర్'' పర్యావరణహితమైందంటూ ఒక వీడిమోను ట్వీట్ చేసింది. తమ ట్రాక్టర్లను వాడాలని కంపెనీ సూచించింది. ఈ వీడియో ఆనంద్ మహీంద్రను ఆకర్షించింది. కాగా పంట వ్యర్థాలను తగులబెట్టడం పర్యావరణ వ్యవస్థకు తీవ్ర ముప్పుగా ప రిణమిస్తోంది. ముఖ్యంగా  ఉత్తర భారతదేశంలో వీటిని  కాల్చడం మూలగా  వస్తున్న పొగ భయంకరమైన కాలుష్యాన్ని వెదజల్లుతోంది. హర్యానా,  పంజాబ్ రాష్ట్రాల్లోని  రైతులు తమ పొలాల్లో పంట తరువాత గడ్డిని తగులబెట్టడం దేశ రాజధాని ఢిల్లీ నగరాన్ని కమ్మేస్తోంది.  అలాగే దేశ వ్యాప్తంగా పలు చోట్లు అనుసరిస్తున్న ఈ పద్థతి పర్యావరణాన్ని హానికరంగా పరిణమిస్తున్న సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు