సీఎం జగన్‌ను కలిసిన స్విట్జర్లాండ్‌ ప్రవాసాంధ్రులు

25 May, 2022 17:05 IST|Sakshi

వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సదస్సుకు హాజరై దావోస్‌ ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు స్విట్జర్లాండ్‌లోని వివిధ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రవాసాంధ్రులు. ఏపీలో చేపడుతున్న కార్యక్రమాలు బాగున్నాయని వారు కితాబునిచ్చారు. అభివృద్ధి, సంక్షేమం, విద్యా, వైద్య రంగాల్లో ఏపీ ప్రభుత్వం చక్కటి కృషి చేస్తోందంటూ తమ అభిప్రాయాలను సీఎం జగన్‌కి తెలిపారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడంలో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారంటూ వారు ఏపీ ప్రభుత్వాన్ని కొనియాడారు.  


 

చదవండి: CM YS Jagan Davos Tour: ఏపీకి మరో రూ.65 వేల కోట్లు

మరిన్ని వార్తలు