వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం: ఏపీ పెవిలియన్‌ ప్రారంభించిన సీఎం జగన్‌

22 May, 2022 14:50 IST|Sakshi

వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ (డబ్ల్యూఈఎఫ్) సదస్సుకి హాజరైన ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు క్లాజ్ ష్వాప్‌తో సమావేశమయ్యారు. ఏపీకి భారీ ఎత్తున పెట్టుబడులు సాధించేందుకు సీఎం జగన్‌తో పాటు మంత్రులు దావోస్‌ సదస్సుకు వెళ్లారు. 2022 మే 22 నుంచి 26 వరకు ఈ సదస్సు జరగనుంది. అందులో భాగంగా సమావేశం తొలిరోజు డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు క్లాజ్ ష్వాప్‌తో సీఎం జగన్‌ చర్చలు జరిపారు. పారిశ్రామిక రంగానికి ఏపీలో ఉన్న సానుకూల అంశాలను సవివరంగా సీఎం జగన్‌ తెలిపారు.   

ఏపీ పెవిలియన్‌ ప్రారంభం
వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సు సందర్భంగా దావోస్‌లో ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్‌ని సీఎం జగన్‌ ప్రారంభించారు. అనంతరం జ్యోతిప్రజ్వాలన చేశారు. ఏపి పెవిలియన్‌లో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఆ తర్వాత సీఎం జగన్‌ నేతృత్వంలో మంత్రులు, ఎంపీలు సమావేశాలకు బయల్దేరి వెళ్లారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


 చదవండి👉దావోస్‌లో సీఎం జగన్‌కు ఘన స్వాగతం

మరిన్ని వార్తలు