ఏపీలో అపర్ణ రూ.100 కోట్ల పెట్టుబడి

7 Dec, 2021 08:55 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: బిల్డింగ్‌ మెటీరియల్స్‌ రంగంలో ఉన్న అపర్ణ ఎంటర్‌ప్రైసెస్‌.. విటిరో టైల్స్‌ తయారీ సామర్థ్యం పెంచేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని పెద్దాపురం వద్ద ఉన్న ప్లాంటులో రూ.100 కోట్లు వెచ్చించింది. దీంతో ఉత్పత్తి సామర్థ్యం రెండింతలై రోజుకు 30,000 చదరపు అడుగులకు చేరిందని కంపెనీ ఎండీ అశ్విన్‌ రెడ్డి తెలిపారు. టైల్స్‌ విభాగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 50 శాతం వృద్ధి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.    

మరిన్ని వార్తలు