సుప్రీం కోర్టులో రిలయన్స్‌కి చుక్కెదురు

6 Aug, 2021 12:07 IST|Sakshi

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో రిలయన్స్‌కు చుక్కెదురైంది. ఫ్యూచర్ రిటైల్ విషయంలో అమెజాన్‌కు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. గతంలో ఫ్యూచర్‌, రిలయన్స్ రిటైల్‌ గ్రూపుల మధ్య రూ 24,713 కోట్ల ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాన్ని అమెజాన్‌ సవాల్‌ చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. 

ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత రిలయన్స్‌ ఫ్యూచర్‌ డీల్ ఒప్పందాన్ని నిలిపేస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. ఈ వివాదానికి సంబంధించి సింగపూర్‌ ఎమర్జెన్సీ ఆర్బిట్రేటర్‌ ఇచ్చిన తీర్పు అమలు చేయాలని ఆదేశించింది.
 

మరిన్ని వార్తలు