-

బీమా క్లెయిమ్స్‌ తిరస్కరణపై తస్మాత్‌ జాగ్రత్త.. సుప్రీం హెచ్చరిక

29 Dec, 2021 10:48 IST|Sakshi

న్యూఢిల్లీ: బీమా తీసుకునే సమయంలో పాలసీదారు దరఖాస్తులో వెల్లడించిన (అప్పటి) వైద్య పరిస్థితిని ఉదహరించడం ద్వారా.. బీమా సంస్థ సంబంధిత వ్యక్తి  క్లెయిమ్‌ను తిరస్కరించలేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్, బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.

బాధ్యత ఉంది
బీమా తీసుకునే వ్యక్తిపైనా తనకు తెలిసిన అన్ని వాస్తవాలను బీమా సంస్థకు వెల్లడించాల్సిన అవసరం, బాధ్యత ఉంటుందని స్పష్టం చేసింది.‘‘బీమా చేసిన వ్యక్తి వైద్య పరిస్థితిని అంచనా వేసి, పాలసీ జారీ చేసిన తర్వాత ఏదై నా క్లెయిమ్‌కు సంబంధించి బీమాదారుడికి అప్పటికే ఉన్న వైద్య పరిస్థితిని ఉదహరించడం ద్వారా ఆ క్లెయిమ్‌ను బీమా సంస్థ తిరస్కరించలేదు’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌  ఇచ్చిన ఒక రూలింగ్‌పై దాఖలైన అప్పీల్‌ను పరిష్కరిస్తూ, సుప్రీం తాజా తీర్పు ఇచ్చింది. 
 

చదవండి:ఆమ్వే, ఓరిఫ్లేమ్‌, టప్పర్‌వేర్‌.. డైరెక్ట్‌ సెల్లింగ్‌ కంపెనీలకు షాక్‌ ! 

మరిన్ని వార్తలు