శాటిలైట్‌ కనెక్టివిటీతో పల్లెలకు టెలికం సేవలు

6 Jul, 2021 15:51 IST|Sakshi

న్యూఢిల్లీ: టెలికం నెట్‌వర్క్స్‌లో శాటిలైట్‌ కనెక్టివిటీ వినియోగించేందుకు డిజిటల్‌ కమ్యూనికేషన్స్‌ కమిషన్‌ (డీసీసీ) గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఆప్టికల్‌ ఫైబర్‌ వేయలేని ప్రాంతాల్లో టెలికం సేవలు అందించేందుకు, కఠిన భూభాగాల్లో మొబైల్‌ టవర్ల అనుసంధానానికి శాటిలైట్‌ కనెక్టివిటీ ఉపయోగపడుతుంది. 16 రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసులు అందించేందుకు ప్రతిపాదించిన భారత్‌నెట్‌ ప్రాజెక్ట్‌కు సైతం డీసీసీ  ఆమోదం లభించింది.

ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో రూ.19,041 కోట్ల వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌తో ఈ ప్రాజెక్టుకు చేపట్టనున్నారు. దీని కోసం వారం రోజుల్లో టెండర్లను టెలికం శాఖ పిలవనుంది. భారతీ గ్రూప్‌ శాటిలైట్‌ కమ్యూనికేషన్స్‌ సంస్థ వన్‌వెబ్‌లో పెట్టుబడులు పెట్టినందున తాజా నిర్ణయం భారతి ఎయిర్‌టెల్‌కు ప్రయోజనకరంగా ఉంటుంది. 

మరిన్ని వార్తలు