బాండ్ల జారీ ద్వారా రూ.105 కోట్లు: అపోలో

15 Dec, 2022 07:07 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ విధానంలో ఐసీఐసీఐ బ్యాంక్‌నకు నాన్‌–కన్వర్టబుల్‌ డిబెంచర్లను జారీ చేయడం ద్వారా రూ.105 కోట్లు సమీకరించనున్నట్టు అపోలో హాస్పిటల్స్‌ ఎంటర్‌ప్రైసెస్‌ బుధవారం తెలిపింది.

ఒక్కొక్కటి రూ.10 లక్షల విలువైన 1,050 ఎన్‌సీడీలను జారీ చేసేందుకు డైరెక్టర్ల కమిటీ ఆమోదం తెలిపిందని కంపెనీ వెల్లడించింది. ఎన్‌ఎస్‌ఈ హోల్‌సేల్‌ డెట్‌ మార్కెట్లో వీటిని లిస్ట్‌ చేయనున్నట్టు ప్రకటించింది.

చదవండి: యాహూ.. అంబులెన్స్‌ కంటే ముందే వెళ్లా.. నా భార్యను కాపాడుకున్నా!

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు