వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వద్దన్నారని జాబ్‌కు రిజైన్‌, వెనక్కి తగ్గిన యాపిల్‌!

4 Jun, 2022 13:22 IST|Sakshi

యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ రిటర్న్‌ టూ ఆఫీస్‌ పాలసీ విషయంలో తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులు వీలును బట్టి  ఆఫీస్‌కు రావాలని, లేదంటే వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేయోచ్చని అన్నట్లు పలు రిపోర్ట్‌లు విడుదలయ్యాయి.   
 
కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో యాపిల్‌ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఉద్యోగులకు మెయిల్ పెట్టింది. ఆ మెయిల్‌లో కరోనా వ్యాప్తి తగ్గుతుంది.అందుకే ఉద్యోగులు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు స్వస్తి చెప్పి ఆఫీస్‌కు రావాలి. దశల వారీగా ఏప్రిల్‌ 11 నుంచి మే 23 ఉద్యోగులు కార్యాలయాలకు రావడాన్ని తప్పని సరిచేసింది. 

అయితే యాపిల్‌ యాజమాన్యం తీరుపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వద్దన్నారంటూ సంవత్సరానికి రూ.8 కోట్లు వేతనం తీసుకునే యాపిల్‌ మెషిన్‌ లెర్నింగ్‌ డైరెక్టర్‌ ఇయాన్‌ గుడ్‌ ఫెలో తన జాబ్‌కు రిజైన్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌తో ప్రొడక్టివిటీ పెరుగుతుంది.ఆఫీస్‌కు రాలేమని మెయిల్‌లో పేర్కొన్నారు. గుడ్‌ఫెలో దారిలో వందలాది యాపిల్‌ ఉద్యోగులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. గుడ్‌ఫెలో చేసిన ఆ ఒక్క ప్రకటనే యాపిల్‌ సంస్థను కలవరానికి గురి చేసింది.  

ఈ నేపథ్యంలో టిమ్‌ కుక్‌ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారంటూ బ్లూమ్‌ బర్గ్‌  తెలిపింది. రాబోయే నెలల్లో వారికి నచ్చినట్లుగానే ఉద్యోగులు విధులు నిర్వహించుకోవచ్చని హైలెట్‌ చేసింది. అదే సమయంలో పని గంటల్ని ప్రస్తుతం ఉన్న 10గంటల సమయాన్ని 12గంటలకు పెంచనున్నట్లు సమాచారం. ఈ విషయంపై యాపిల్‌ నుంచి ఎలాంటి స్పష్టత లేదు. కాగా పనిగంటలు పెంచడంతో పాటు ఉద్యోగులకు చెల్లించే జీతభత్యాల్ని సైతం భారీగా పెంచనున్నట్లు వెలుగలోకి వచ్చిన కొన్ని నివేదికలు హైలెట్‌ చేస్తున్నాయి.

చదవండి👉జీతం రూ.8కోట్లు..వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వద్దన్నారని జాబ్‌కు రిజైన్‌ చేశాడు!

మరిన్ని వార్తలు