స్వరం మారింది.. చైనాపై యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ ప్రశంసల వర్షం!

25 Mar, 2023 19:50 IST|Sakshi

యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ చైనా విషయంలో స్వరం మార్చారు. చైనా వేగవంతమైన ఆవిష్కరణలపై టిమ్‌ కుక్‌ ప్రశంసల వర్షం కురిపించారంటూ స్థానిక మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.  
 
కరోనా మహమ్మారి అదుపులోకి రావడంతో డ్రాగన్‌ ప్రభుత్వం చైనా బిజినెస్‌ సమ్మిట్‌ను అధికారికంగా నిర్వహించింది. ఆ సమ్మిట్‌కు ప్రభుత్వ ఉన్నతాధికారులు, టిమ్‌ కుక్‌తో పాటు కోవిడ్‌ తయారీ సంస్థల ఫైజర్‌, బీహెచ్‌పీ సీఈవోలు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా..చైనాలో వేగంగా ఆవిష్కరణలు జరుగుతున్నాయి. ఇవి మరింత వేగవంతమవుతాయని విశ్వసిస్తున్నా అని టిమ్‌కుక్‌ వ్యాఖ్యానించినట్లు ఓ వార్తా సంస్థ పేర్కొంది. కాగా, ఇటీవల స్పై బెలూన్‌ విషయంలో అమెరికా-చైనా మధ్య నెలకొన్న వివాదం, యాపిల్‌ ప్రొడక్ట్‌లలో సప్లై చైన్‌ సమస్యలతో.. ఆదేశంపై ఆధారపపడం తగ్గించి భారత్‌తో పాటు ఇతర దేశాల్లో ఉత్పత్తి కేంద్రాలను తరలించాలని యాపిల్‌ ప్రయత్నాలు చేస్తోంది. ఈ తరుణంలో చైనాపై టిమ్‌ కుక్‌ వ్యాఖ్యలు వ్యాపార వర్గాల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు