పదేళ్లుగా నడుస్తోంది.. ఐఫోన్లకు సంబంధించి పెద్ద సీక్రెట్‌ బయటపెట్టిన యాపిల్‌ సీఈఓ!

15 Dec, 2022 10:56 IST|Sakshi

ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్‌కి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫోన్ల మార్కెట్‌లో తనకంటూ ప్రత్యేకమైన నేమ్‌తో పాటు ఫేమ్‌ను సంపాదించుకుంది ఐఫోన్‌. దీని తయారీ వెనుక ఏ విషయాన్ని యాపిల్‌ కంపెనీ బయటపెట్టేది కాదు. అయితే తాజాగా సంస్థ సీఈఓ ఐఫోన్లకు సంబంధించి ఓ పెద్ద సీక్రెట్‌ని రివీల్‌ చేశారు. అదేంటో తెలుసుకుందాం!

ఐఫోన్‌ కెమెరాతో క్లిక్‌ చేస్తే ఫోటో అద్భుతంగా రావాల్సిందే. ఎందుకంటే దాని క్లారిటీ అలాంటిది మరీ. తాజాగా జపాన్‌ పర్యటనలో ఉన్న యాపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ ఐఫోన్‌ కెమెరాలకు సంబంధించి పెద్ద రహస్యాన్ని బయటపెట్టాడు. ఐఫోన్‌ కెమెరాలను సోనీ సంస్థ తయారు చేస్తుందని తెలిపారు. అత్యున్నత కెమెరా సెన్సర్ల కోసం దశాబ్ధకాలంగా సోనీ సంస్థతో తాము చేతులు కలిపామని కుక్‌ ట్వీట్‌ ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. తమ భాగస్వామ్యం నిరంతం కొనసాగుతుందన్నారు.

సంవత్సరాలుగా, ఆపిల్ ఐఫోన్ మోడల్‌లలో ఉపయోగించే హార్డ్‌వేర్ గురించి పెదవి విప్పలేదు. అంతేకాకుండా ఏదైనా ఐఫోన్ మోడల్స్‌లో కూడా అధికారిక స్పెక్స్ షీట్‌న్‌ చూసినట్లయితే, కంపెనీ ర్యామ్, కెమెరా రిజల్యూషన్ సహా నిర్దిష్ట వివరాలను ఎప్పుడూ వెల్లడించలేదు. సోనీ ఐఫోన్‌ల కోసం కెమెరా సెన్సార్లను తయారు చేస్తుందన్న విషయాన్ని టిమ్ కుక్ తొలిసారిగా వెల్లడించడం గమనార్హం. కొన్ని మీడియా నివేదికల ప్రకారం, సోనీ తన కెమెరా సెన్సార్‌ పనితనం మరింత పెంచేందుకు కొత్త సెమీకండక్టర్ ఆర్కిటెక్చర్‌ను ఉపయోగించే కొత్త ఇమేజ్ సెన్సార్‌ను అభివృద్ధి చేస్తోందట.
 

చదవండి: యాహూ.. అంబులెన్స్‌ కంటే ముందే వెళ్లా.. నా భార్యను కాపాడుకున్నా!

మరిన్ని వార్తలు