వర్క్‌ఫ్రం హోంపై యాపిల్‌ సీఈవో టిమ్‌కుక్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

11 Jun, 2022 15:11 IST|Sakshi

కరోనా భయాలు పూర్తిగా తొలగిపోలేదు. ఇంకా కొత్త వేరియంట్లు భయపెడుతూనే ఉన్నాయి. ఉన్నట్టుండి కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు కంపెనీలు ఇక వర్క్‌ఫ్రం హోం చాలు ఆఫీసులకు రండి అంటూ తాకీదులు పంపుతున్నాయి. ఈ తరుణంలో ప్రపచంలోనే అతి పెద్ద కార్పొరేట్‌ కంపెనీల్లో ఒకటైన యాపిల్‌ సీఈవో టిమ్‌కుక్‌ ఈ అంశంపై స్పందించారు. 

ప్రయోగాలు చేస్తున్నాం
టైమ్‌ మ్యాగజైన్‌ నిర్వహించిన ఓ సదస్సులో టిమ్‌ కుక్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,.. వర్క్‌ ఫ్రం హోం, ఆఫీసు నుంచి పని ఈ రెండు విధానాల విషయంలో యాపిల్‌ అనేక ప్రయోగాలు చేస్తోందని వివరించారు. ఇంత వరకు ఇలాంటి పరిస్థితిని మనం ఎదుర్కొలేదు. కాబట్టి ఉద్యోగులు, సంస్థలకు మేలు చేసే విధానం ఏంటనేది తెలుసుకోవాలంటూ రకరకాల ప్రయోగాలు చేయకతప్పదని పేర్కొన్నారు. ప్రస్తుతం యాపిల్‌లో వారానికి రెండు రోజుల పాటు వర్క్‌ ఫ్రం హోంకి అవకాశం కల్పిస్తున్నట్టు టిమ్‌కుక్‌ తెలిపారు.

మెంటల్‌ హెల్త్‌
కరోనా సంక్షోభం రావడానికి ముందు అందరికీ ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ మీద ఎక్కువ శ్రద్ధ ఉండేది. కానీ కరోనా అది మోసుకొచ్చిన అనేక సమస్యలు మెంటర్‌ హెల్త్‌ మీద చాలా ప్రభావం చూపించాయి. ఫిజికల్‌గా ఫిట్‌గా ఉంటే సరిపోదు మెంటల్‌ హెల్త్‌ కూడా ముఖ్యమే అనే భావన కలిగించాయి. కాబట్టి మెంటల్‌ హెల్త్‌కి ఏ పద్దతి మంచిదనేది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలని కుక్‌ అన్నారు.

ఆఫీస్‌ వర్క్‌.. కానీ
వ్యక్తిగతంగా తనకు పర్సనల్‌ రిలేషన్స్‌ అంటేనే ఎక్కువ ఇష్టమంటూ ఆఫీసుకు వర్క్‌కే ఆయన మొగ్గు చూపారు. అయితే వర్చువల్‌ వర్క్‌ అనేది ఆఫీస్‌ వర్క్‌ కంటే తక్కువ స్థాయిది ఏమీ కాదని, అదొక భిన్నమైన పని విధానమంటూ చెప్పుకొచ్చారు టిమ్‌కుక్‌. మొత్తంగా ఆఫీస్‌ వర్క్‌ పని విధానమే మేలైనప్పటికీ ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా దాన్ని బలవంతంగా అమలు చేయడం సరికాదన్నట్టుగా టిమ్‌కుక్‌ వ్యాఖ్యలు చేశారు. 

చదవండి: Crypto Currency: క్రిప్టోలు ‘సముద్ర దొంగల ప్రపంచమే’!

మరిన్ని వార్తలు