Apple: మార్కెట్‌లో చిప్‌సెట్ల కొరత .. తయారీకి ఇబ్బందులు

31 Jul, 2021 13:44 IST|Sakshi

మనిషిని ఆపరేట్‌ చేసేది మెదడు. మరి ఆ మెదడునే మనిషి ఆపరేట్‌ చేస్తే..ఇదిగో ఇలాంటి ఐడియాతో మనిషి మెదడులో కంప్యూటర్‌ చిప్‌ను అమర్చేందుకు ఎలాన్‌ మస్క్‌ న్యూట్రాలింక్‌ ప్రయోగం తెరపైకి తెచ్చారు. ఆ ప్రయోగం ఎలా ఉన్నా ఇప్పుడు ప్రపంచ దేశాల్ని చిప్‌ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ముఖ్యంగా టెక్‌ దిగ్గజం ఆపిల్‌పై దీని ప్రభావం ఎక్కువగానే ఉంది.

 
 
నేడు మనం వినియోగించే అన్ని ఎలక్ట్రానిక్‌ పరికరాల్లో సెమీ కండక్లర్లు, మైక్రో ప్రాసెసర్లు ఉంటాయి. ఇలాంటి సెమీ కండక్టర్లు, మైక్రో ప్రాసెసర్ల సమాహరాన్నే చిప్‌ లేదా చిప్‌సెట్‌గా పిలుస్తారు. అయితే కరోనా కారణంగా లాక్‌ డౌన్‌ విధించడంతో చిప్‌ల తయారీ గణనీయంగా తగ్గిపోయింది. మరోవైపు  కరోనా వల్ల తలెత్తిన పరిస్థితుల్లో ఆన్‌లైన్‌ వ్యవహరాలు పెరిగిపోయాయి. జూమ్‌ మీటింగ్స్‌, వర్క్‌ ఫ్రం హోం, ఆన్‌ లైన్‌ క్లాసులతో స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, మాక్‌ప్యాడ్‌, ఐప్యాడ్‌ల  వినియోగం పెరిగింది. ఒక్కసారిగా వీటికి డిమాండ్‌ పెరిగింది. కరోనా సంక్షోభంతో పాటే ఈ సమస్య తలెత్తినా.. గత మార్చి వరకు పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అప్పటికే  చిప్‌లు స్టాక్‌ ఉండడంతో  సమస్యలు తలెత్తలేదు. 

ఓ వైపు చిప్‌ స్టాక్‌ అయిపోవడం మరో వైపు చిప్‌ల తయారీ ఇంకా పుంజుకోకపోవడంతో సమస్య తల్తెతింది. చిప్‌లు, సెమీ కండర్లు లేకపోవడం వల్ల ప్రముఖ టెక్‌ దిగ్గజం ఆపిల్‌ వ్యాపారం దెబ్బతింటుందేమోనన్న ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ అంశంపై ఆపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ మాట్లాడుతూ... చిప్‌ సెట్ల కొరత కారణంగా మాక్‌, ఐప్యాడ్‌ అమ్మకాలు క్షీణించినట్లు చెప్పారు. సెప్టెంబర్  త్రైమాసికం సమయానికి చిప్‌ మార్కెట్‌లోకి రాకపోతే తమకు కష్టమేనన్నారు.  ఇక ఈ ఏడాది ఏప్రిల్‌ - జూన్‌ త్రైమాసికంలో ఆపిల్‌ ఆదాయం సుమారు 6 లక్షల కోట్లుగా నమోదు అయ్యింది. ఇందులో  మాక్ నుంచి వచ్చే ఆదాయం సుమారు రూ .61 వేల కోట్లు ఉండగా ఐప్యాడ్ ద్వారా వచ్చే ఆదాయం సుమారు 54 వేల కోట్లుగా నమోదు అయ్యింది.

మరిన్ని వార్తలు