Steve Jobs పాత చెప్పులు వేలం: రికార్డు ధర

16 Nov, 2022 12:17 IST|Sakshi

న్యూఢిల్లీ: యాపిల్ కోఫౌండర్‌ దివంగ‌త స్టీవ్ జాబ్స్ పాత చెప్పులు రికార్డ్ ధరకు అమ్ముడు బోవడం విశేషంగా నిలిచింది. అమెరికాలో జూలియెన్స్ ఆక్షన్‌ కంపెనీ ఆదివారం నిర్వ‌హించిన వేలంలో స్టీవ్ జాబ్స్  ధరించిన బిర్కెన్‌స్టాక్ కంపెనీ సాండ‌ల్స్  అత్య‌ధిక ధ‌ర‌ను దక్కించుకున్నాయి. 2,20,000 వేల డాల‌ర్లు (సుమారు రూ.1.78 కోట్లు)  ఒక వ్యక్తి వీటిని సొంతం చేసుకున్నారు. (అరిగిపోయిన చెప్పులకు అన్ని వేల డాలర్లా? ఎవరివో గుర్తు పట్టగలరా?)

1970ల మధ్యకాలంలో స్టీవ్ జాబ్స్‌కి ఎంతో ఇష్టమైన బ్రౌన్ స్వెడ్ బిర్కెన్‌స్టాక్  సాండిల్స్‌ అత్యధిక ధరతో రికార్డు సృష్టించాయని జూలియన్స్ ఆక్షన్‌ పేర్కొంది. వేలంలో వీటికి  60 వేల డాల‌ర్ల ధ‌ర వ‌స్తుంద‌ని భావించారు. ఈ సాండ‌ల్స్‌కి నాన్ ఫంజిబుల్ టోకెన్ ధ‌ర 2,18.750 డాల‌ర్లుగా నిర్ణ‌యించారు. అయితే, రికార్డు స్థాయిలో రెండు ల‌క్ష‌ల ఇర‌వై వేల డాల‌ర్లు వ‌చ్చాయి. 

అయితే ఈ సాండ‌ల్స్‌ని కొనుగోలు చేసిన ఎవరు కొనుగోలు చేశారు అనే వివరాలను మాత్రం జూలియెన్స్ కంపెనీ వెల్ల‌డించ‌ లేదు. 1976లో స్టీవ్ వోజ్నియాక్ క‌లిసి కాలిఫోర్నియాలో యాపిల్ కంపెనీని ప్రారంభించారు స్టీవ్ జాబ్స్. ఆధునిక టెక్నాలజీతో, పాపులర్‌ యాపిల్‌ ఉత్పత్తులతో ఆధునిక టెక్‌ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్న స్టీవ్‌ జాబ్స్‌  క్యాన్స‌ర్‌తో  2011లో  కన్నుమూశారు.  

ఇదీ చదవండి:  ElonMusk బ్లూటిక్‌ బాదుడు పక్కా,ముహూర్తం ఫిక్స్‌

మరిన్ని వార్తలు