ఆ ఐఫోన్ ఉత్పత్తిని నిలిపివేయనున్న ఆపిల్

8 Feb, 2021 20:35 IST|Sakshi

ఎన్ని మొబైల్స్ మార్కెట్లోకి వచ్చిన ఐఫోన్ మొబైల్స్ ఉన్న క్రెజ్ ఏ మాత్రం తగ్గదు. అందుకే ఆపిల్ నుంచి విడుదలైన ప్రతి మోడల్ హాట్ కేకుల్లా అమ్ముడవుతాయి. కానీ ఒక ఐఫోన్ కు మాత్రం అనుకున్నంత ఆదరణ రావడం లేదు. గత ఏడాది సెప్టెంబర్ లో తీసుకొచ్చిన ఐఫోన్ 12మినీ ఉత్పత్తిని ఆపిల్ నిలిపివేయచ్చు అనే సమాచారం బయటకి వస్తుంది. మినీ-వెర్షన్ ఐఫోన్ ఐఫోన్ 12, ఐఫోన్ 12ప్రో, ఐఫోన్ 12ప్రో మాక్స్ లతో పాటు ఇది ప్రారంభమైంది. ఈ ఐఫోన్ 12మోడళ్లలో ఉన్న దాదాపు అన్ని ఫీచర్లను కలిగి ఉంది.

బడ్జెట్ ప్రజల కోసం తీసుకొచ్చిన ఈ మొబైల్ రెండవ త్రైమాసికం తర్వాత నిలిపివేయవచ్చు అని జెపి మోర్గాన్ నిపుణుడు పేర్కొన్నారు. మంచి పనితీరు కనబరిచినప్పటికీ డిమాండ్ తక్కువగా ఉన్న కారణంగా నిలిపివేస్తున్నట్లు తెలుస్తుంది. అక్టోబర్, నవంబర్ నెలల ఐఫోన్ అమ్మకాల్లో ఐఫోన్ 12 మినీ కేవలం 6 శాతం వాటాను మాత్రమే నమోదు చేసిందని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. ఈ ఐఫోన్ ఇతర వాటితో పోల్చితే చిన్నగా ఉండటంతో పాటు బ్యాటరీ జీవితం కూడా తక్కువగా ఉంటుంది. ఐఫోన్ 12 మినీ ప్రపంచంలోనే అత్యంత చిన్నదైన 5జీ మొబైల్ కావడం విశేషం. ఐఫోన్ 12మినీ 5.4 ఇంచుల డిస్ప్లేను కలిగి ఉంటుంది.

చదవండి: అదిరిపోయే ఫీచర్స్ తో విడుదలైన ఎంఐ11
              వాట్సాప్‌ను వెనక్కి నెట్టేసిన టెలిగ్రాం

 
 

>
మరిన్ని వార్తలు