ఆపిల్ దివాలీ గిఫ్ట్ : కళ్లు చెదిరే ఆఫర్

10 Oct, 2020 13:12 IST|Sakshi

ఐఫోన్ 11 కొనుగోలుపై ఎయిర్ పాడ్స్ ఉచితం

అక్టోబరు 17 నుంచి ఆఫర్  అందుబాటులోకి

ఆన్‌లైన్ స్టోర్ లేదా ఆపిల్ ఇండియా వెబ్‌సైట్   కొనుగోళ్లపై ఆఫర్

సాక్షి, ముంబై: ఈ దీపావళికి ఐఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకోసం మంచి అవకాశం సిద్ధమవుతోంది. టెక్ దిగ్గజం, ఐఫోన్ తయారీదారు ఆపిల్ ఈ పండుగ సందర్భంలో తన అభిమానులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఐఫోన్ 11 కొనుగోలు చేసిన వారికి భారతదేశం అంతటా ఎయిర్‌పాడ్‌ ఉచితంగా అందించనుంది. కొత్తగా ప్రారంభించిన ఆన్‌లైన్ స్టోర్ లేదా ఆపిల్ ఇండియా వెబ్‌సైట్  ద్వారా  ఐఫోన్ 11 కొనుగోలు చేసిన వినియోగదారులకు 15 వేల రూపాయల ఎయిర్‌పాడ్స్‌ను ఉచితంగా అందించనుంది.  (ఐపోన్ 12 : ఆపిల్ ఈవెంట్ పై క్లారిటీ)

ఈ పరిమిత సమయం ఆఫర్ అక్టోబర్ 17 నుండి ప్రారంభమవుతుంది. 64 జీబీ వేరియంట్  ఐఫోన్ 11 ఆపిల్ ఆన్‌లైన్ స్టోర్‌లో రూ .68,300 ధర వద్ద లభిస్తుంది. ఎయిర్‌పాడ్స్ 14,990 రూపాయలకు  విక్రయిస్తోంది. అయితే ఆపిల్ అందించే తాజా ఉచిత ఎయిర్‌పాడ్స్ ఆఫర్‌తో ప్రస్తుతం ఐఫోన్ 11 ధర రూ. 53,310 దిగి వచ్చినట్టే. ఆపిల్ వినియోగదారులు గమనించవలసిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆపిల్ ఉత్పత్తులపై  డీల్స్  సాధారణంగా ఎక్కువ సమయం ఉండవు. సో.. ఆపిల్ ప్రేమికులు..త్వర పడండి!! (అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ : ఐఫోన్ 11పై ఆఫర్)

కాగా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా 50వేల రూపాయల లోపు ధరకే ఐఫోన్ 11ను అందుబాటులోకి  తెస్తున్నట్టు ప్రకటించింది. అటు మరో దిగ్గజం ఫ్లిప్ కార్ట్ అక్టోబర్ 16-21వరకు బిగ్ బిలియన్ డేస్ అమ్మకాలకు తెరతీయనున్న సంగతి తెలిసిందే. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు