Apple: యాపిల్‌ ఉద్యోగులకు ఊరట..మెయిల్‌లో ఏం చెప్పిందంటే!

2 Aug, 2022 18:17 IST|Sakshi

ఉద్యోగులకు ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌ ఊరట కల్పించింది. కరోనా కేసులు అదుపులోకి రావడంతో చాలా కంపెనీలు ఉద్యోగులు కార్యాలయాల్ని మాస్క్‌ను ధరించే అవసరం లేదని స్పష్టం చేస్తున్నాయి. తాజాగా ఉద్యోగులు ఆఫీస్‌లో మాస్క్‌ ధరించాల్సిన అవసరం లేదని యాపిల్‌ తన ఉద్యోగులకు మెయిల్‌ చేసింది. 

ఉద్యోగులు మాస్క్‌ ధరించాలన్న కఠిన నిబంధనల్ని యాపిల్‌ సడలించింది. మాస్క్‌ ధరిస్తే సురక్షితం అనుకుంటే ధరించండి. ఆ విషయంలో ఏమాత్రం వెనకాడొద్దు. అలాగే ప్రతి వ్యక్తి మాస్క్ ధరించాలా వద్దా అనే నిర్ణయాన్ని గౌరవించండి అంటూ మెయిల్‌లో పేర్కొంది. 

ది వెర్జ్ నివేదిక ప్రకారం.. యాపిల్‌ తెచ్చిన ఈ కొత్త నిబంధన కొన్ని స్థానాల్లో వర్తించదని తెలిపింది.“ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, చాలా ప్రదేశాలలో ఇకపై ఫేస్ మాస్క్ ధరించాల్సిన అవసరం లేదు. ఎప్పటిలాగే వర్క్‌ విషయంలో సహచర ఉద్యోగులతో మాట్లాడడం లేదంటే వారి క్యాబిన్‌లలోకి వెళ్లే సమయంలో జాగ్రత్తలు పాటించాలని యాపిల్‌ తన ఉద్యోగులకు పెట్టిన మెయిల్‌లో పేర్కొందని ది వెర్జ్‌ హైలెట్‌ చేసింది.  

పెరిగిపోతున్న బీఏ.5 వేరియంట్‌ కేసులు  
ఇటీవల కోవిడ్-19లోని బీఏ.5 వేరియంట్‌ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ తరుణంలో యాపిల్ తన ఉద్యోగులకు మాస్క్‌లు ధరించాల్సిన అవసరం లేదని చెప్పడం.. అదే సమయంలో సురక్షితం అనుకుంటే మాస్క్‌లు ధరించమని చెప్పడం వివాదాస్పదంగా మారింది. ఒక వారం ముందు, బే ఏరియా ట్రాన్సిట్ సిస్టమ్ ఏరియా అధికారులు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధులు మాస్క్‌ తప్పని సరి చేశారు. బే ఏరియాతో పాటు మిగిలిన ప్రాంతాల్లో మాస్క్‌ ధరించడం తప్పని సరి చేశారు స్థానిక అధికారులు.

మరిన్ని వార్తలు