మార్కెట్‌ క్యాప్‌లో నెం.1గా యాపిల్‌

1 Aug, 2020 14:39 IST|Sakshi

ప్రపంచంలోనే అత్యంత విలువైన పబ్లిక్‌ లిస్టెడ్‌ కంపెనీగా యాపిల్‌ అవతరించింది. కరోనా కల్లోల సమయంలోనూ కంపెనీ అదిపోయే క్యూ2 ఫలితాలను ప్రకటించింది. మెరుగైన ఫలితాల ప్రకటన నేపథ్యంలో కంపెనీ షేరు 10శాతానికి పైగా లాభపడి 425.04 డాలర్ల వద్ద స్థిరపడింది. ఈ క్రమంలో యాపిల్‌ కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ సౌదీ ఆరామ్‌కో మార్కెట్‌ క్యాప్‌ను అధిగమించి 1.82 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంది. గతేడాదిలో స్టాక్‌ మార్కెట్లో లిస్టైన సౌదీ ఆరాంకో మార్కెట్‌ క్యాప్‌ శుక్రవారం నాటికి 1.76ట్రిలియన్‌ డాలర్లుగా ఉంది.

 కరోనా ఎఫెక్ట్‌తో అమెరికాలో టెక్నాలజీ షేర్లకు భారీగా డిమాండ్‌ నెలకొంది. యాపిల్‌ షేరు ఏడాది మొత్తం మీద 45శాతం ర్యాలీ చేసింది. రెండో త్రైమాసికం సందర్భంగా దాదాపు 6తర్వాత యాపిల్‌ కంపెనీ షేర్ల విభజనకు ఆమోదం తెలిపింది. ఈ ఆగస్ట్‌ 31 తరువాత 1:4 విభజిస్తారు. ఈ జూన్‌ కార్వర్ట్‌లో యాపిల్‌ కంపెనీ 16బిలియన్‌ డాలర్ల విలువైన షేర్లను ఇన్వెస్టర్ల నుంచి తిరిగి కొనుగోలు(బైబ్యాక్‌) చేసింది. శుక్రవారం మార్కెట్‌ ముగిసే సరికి 4.33బిలియన్ల అవుట్‌స్టాడింగ్‌ షేర్లు ఉన్నట్లు నాస్‌డాక్‌ ఎక్చ్సేంజ్‌ గణాంకాలు చెబుతున్నాయి. 

మరిన్ని వార్తలు