నేను ఏ తప్పూ చేయలేదు..యాపిల్‌ సంస్థ నన్ను బెదిరిస్తోంది!

17 Aug, 2022 12:34 IST|Sakshi

ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌ ఉద్యోగులకు వార్నింగ్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. కంపెనీ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించినట్లు సమాచారం.

వెర్జ్‌ కథనం ప్రకారం.. క్యాంప్‌బెల్‌ అనే ఉద్యోగి గత ఆరేళ్లుగా యాపిల్‌ సంస్థ ఐఫోన్‌ రిపేర్‌ విభాగంలో టెక్నీషియన్‌గా పనిచేస్తోంది. ఈ తరుణంలో ఐఫోన్‌ సెక్యూరిటీ ఫీచర‍్లపై టిక్‌ టాక్‌లో టిప్స్‌ ఇచ్చింది. దీంతో టిక్‌టాక్‌ వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేసిన యాజమాన్యం తనను ఉద్యోగం నుండి తొలగిస్తామని బెదిరిస్తోందంటూ యాపిల్‌ ఉద్యోగి పేర్కొంది. సెక్యూరిటీ టిప్స్‌ వీడియోలు పోస్ట్‌ చేస్తున్నప్పుడు అందులో తాను యాపిల్‌  ఉద్యోగిని అని చెబితే చర్యలు తప్పవని చెప్పిందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. 

టిక్‌ టాక్‌ వీడియోల్లో ఎక్కడా తాను యాపిల్‌ ఉద్యోని అనే విషయాన్ని చర్చించలేదని, అయినా తనని ఉద్యోగం నుంచి తొలగిస‍్తామని చెప్పడంపై ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు "నేను యాపిల్ ఉద్యోగిని. నా సంస్థకు ఇచ్చే నా సందేశం ఇదే. "ప్రస్తుతం, నేను 3 రోజుల క్రితం పోస్ట్ చేసిన వీడియో కారణంగా నా ఉద్యోగం ఊడిందో లేదో తెలుసుకునేందుకు ఎదురు చూస్తున్నాంటూ వీడియోలో చెప్పడం చర్చాంశనీయంగా మారింది.

చదవండి👉 యాపిల్‌ భారీ షాక్‌, ఉద్యోగులపై వేటు!

మరిన్ని వార్తలు