Apple: యాపిల్‌ భారీ షాక్‌, ఉద్యోగులపై వేటు!

16 Aug, 2022 14:15 IST|Sakshi

ప్రతికూల మార్కెట్‌ పరిస్థితులు, మాంద్యం భయాలతో దిగ్గజ సంస్థలు ఉద్యోగుల నియామకాల్ని నిలిపివేస్తున్నాయి. ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌ ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగించింది.

టెస్లా,మైక్రోసాఫ్ట్‌ బాటలో మరికొన్ని సంస్థలు పయనిస్తున్నాయి. ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. ఇప్పటికే తొలగింపుపై ఉద్యోగులకు మెయిల్‌ పెట్టింది గూగుల్‌. వచ్చే వార్షిక ఫలితాల విడుదల సమాయానికి వారి పనితీరు బాగుంటే కొనసాగించడం, లేదంటే తొలగిస్తామని హెచ్చరించింది. 

ఈ నేపథ్యంలో యాపిల్‌ గత వారంలో 100మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగల్ని తొలగించింది. ప్రస్తుతం యాపిల్‌లో తొలగింపు అంశం చర్చాంశనీయంగా మారగా.. మిగిలిన కంపెనీలు సైతం కాస్ట్‌ కటింగ్‌ గురించి ఆలోచించడంతో ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు.

ఆఫీస్‌కి హాయ్‌..వర్క్‌ ఫ్రం హోమ్‌కి గుడ్‌బై 
మరోవైపు వర్క్‌ ఫ్రం హోమ్‌ చేస్తున్న ఉద్యోగుల్ని ఆఫీస్‌ రావాలంటూ యాపిల్‌ డెడ్‌లైన్‌ విధించింది. ప్రస్తుతం కోవిడ్‌-19 తగ్గి కార్యకలాపాలు నిర్విరామంగా కొనసాగుతుండడంతో వర్క్‌ ఫ్రం హోమ్‌కి స్వస్తి పలకనుంది. కోవిడ్‌తో యాపిల్‌ ఉద్యోగులు హైబ్రిడ్‌ వర్క్‌ పేరుతో వారానికి రెండ్రోజులు మాత్రమే ఆఫీస్‌కు వచ్చేవారు. ఆ తర్వాత ఆ పనిదినాల్ని వారానికి మూడు రోజులకు పెంచింది. మళ్లీ తాజాగా సెప్టెంబర్‌ 5 నుంచి వర్క్‌ ఫ్రమ్‌కు స్వస్తి పలికి.. ఆఫీస్‌కు రావాలని ఉద్యోగులకు మెయిల్‌ పెట్టినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు