ఐఫోన్‌ లవర్స్‌కు శుభవార్త ..‘ఫోల్డ్’​పై యాపిల్​ కన్ను, శాంసంగ్‌కు ధీటుగా

1 Jan, 2023 14:05 IST|Sakshi

ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఫోల్డబుల్‌ ఫోన్‌ మార్కెట్‌లో వినియోగదారుల్ని ఆకట్టుకుంటున్న శాంసంగ్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా యాపిల్‌ సంస్థ ఫోల్డబుల్‌ ఐఫోన్‌ను మార్కెట్‌కి పరిచయం చేయాలని భావిస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

శాంసంగ్​..! ఫోల్టబుల్​ సెగ్మెంట్​లో గెలాక్సీ జెడ్​ ఫోల్డ్​, జెడ్​ ఫ్లిప్​ సిరీస్​తో మార్కెట్‌ను శాసిస్తుంది. దీంతో శాంసంగ్‌ బాటలో ఇతర స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీలు సైతం ఫోల్డబుల్‌ ఫోన్‌ మార్కెట్‌లో అడుగు పెట్టాయి. మంచి మంచి ఫీచర్లు, డిజైన్లతో కొనుగోలు దారుల్ని గణనీయంగా ఆకట్టుకుంటున్నాయి. విక్రయాలు జోరుగా సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యాపిల్‌ సైతం ఫోల్డబుల్‌ మార్కెట్‌లోకి అడుగు పెట్టబోతుందంటూ వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. 

అందుకు ఊతం ఇచ్చేలా అల్ట్రా థిన్​ కవర్​ గ్లాస్​ను తయారు చేసేందుకు.. ఎల్​జీతో యాపిల్​ కలిసి పనిచేయనుంది. ఇప్పటికే 20 ఇంచ్​ ఫోల్డబుల్​ డిస్​ప్లే సప్లై చేసే తయారీ సంస్థలతో యాపిల్‌ మంతనాలు జరుపుతుంది. చర్చలు సఫలమైతే మరో రెండేళ్లలో ఐఫోన్‌ ఫోల్డబుల్‌ ఫోన్‌ మార్కెట్‌లో విడుదల కానుంది.  

మరిన్ని వార్తలు