Apple iPad: విమాన ప్రమాదం, తండ్రి - కూతురు ప్రాణాలు కాపాడిన ఐపాడ్‌..!

17 Nov, 2021 16:36 IST|Sakshi

‘మనిషి.. వాడుకోవలసిన వస్తువులను ప్రేమిస్తున్నాడు, ప్రేమించాల్సిన మనుషుల్ని వాడుకుంటున్నాడు’ ఇది సినిమా డైలాగే. కానీ, ఇటీవల కాలంలో జరుగుతున్న వరుస సంఘటనలు  ఆ డైలాగ్‌ అర్ధాన్నే మార్చేస్తున్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

కొద్ది రోజుల క్రితం యాపిల్‌ స్మార్ట్‌ వాచ్‌ యువకుడి ప్రాణం కాపాడింది. ఇప్పుడు అదే యాపిల్‌ సంస్థకు చెందిన ఐపాడ్‌..విమాన ప్రమాదం నుంచి తండ్రి - కూతుర్ని కాపాడింది. సీఎన్‌ఎప్‌ కథనం ప్రకారం..అమెరికా పెన్సిల్వేనియాకు చెందిన 58ఏళ్ల పైలెట్‌ తన 13ఏళ్ల కుమార్తెతో కలిసి రెండు సీట్ల విమానంలో మరో ప్రాంతానికి బయలుదేరారు. అయితే కొద్దిసేపటికే రాడార్‌లో విమానం ఆచూకీ తప్పిపోయింది. దీంతో అప్రమత్తమైన యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ రెస్క్యూ  సిబ్బంది విమానం చివరి సారిగా తప్పిపోయిన ప్రదేశంలో కోఆర్డినేటర్లు, రెస్క్యూ టీమ్‌లు, 30 మంది వాలంటీర్లు రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించారు.  

అదే సమయంలో పైలట్‌ జాడ గుర్తించిన రెస్క్యూ టీమ్ అతని భార్యను సంప్రదించి, బాధితుడి ఫోన్‌ నెంబర్‌ను సేకరించారు. కానీ ఆ ఫోన్‌ నెంబర్‌ నుంచి బాధితుడికి ఫోన్‌ చేయగా.. ఆఫోన్‌ సిగ్నల్స్‌ మిస్సవ్వడంతో అతడి కుమార్తె వద్ద ఐపాడ్‌ ఉందని గుర్తించారు. ఐపాడ్‌ సిగ్నల్స్‌ ఆధారంగా అధికారులు జీపీఎస్‌ ట్రాకింగ్‌ ద్వారా తండ్రి, కుమార్తె' ఆచూకీ లభ్యమైంది.  

విమానం టేకాఫ్ అయిన విల్కేస్-బారే స్క్రాంటన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 7​ కిలోమీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతానికి చెందిన చెట్ల మధ్య చిక్కుకున్నట్లు గుర్తించారు. విమాన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ బాధితుల్ని అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. బాధితుల‍్ని ఆలస్యంగా ఆస్పత్రిలో జాయిన్‌ చేసి ఉంటే ప్రాణాలు పోయేవని, ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. ప్రమాదంలో గాయపడ్డ బాధితుడి భార్య...విమాన ప్రమాదంలో గాయపడ్డ కుటుంబ సభ్యులు ఐపాడ్‌ వల్ల ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారని సంతోషం వ్యక్తం చేసింది.

చదవండి: యాపిల్‌ లోగో..! టచ్‌ చేసి చూడండి..అదిరిపోద్దంతే..!

మరిన్ని వార్తలు