Apple: వచ్చేస్తోంది..ఐఫోన్‌-13..! లాంఛ్‌ ఎప్పుడంటే..!

8 Aug, 2021 19:30 IST|Sakshi

ప్రపంచవ్యాప్తంగా ఆపిల్​ కంపెనీ ఉత్పత్తులకు  ఉండే ఆదరణ అంతా ఇంతా కాదు. ఆపిల్‌ ఐఫోన్లకు మార్కెట్‌లో విపరీతమైన క్రేజ్‌ ఉంటుంది. ఐఫోన్​ 13 సిరీస్​ స్మార్ట్​ఫోన్లను లాంచ్​ చేసేందుకు సిద్ధమవుతోంది ఆపిల్‌.  ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఐఫోన్‌ -13 ఫోన్లను వచ్చే నెల సెప్టెంబర్‌ మూడో వారంలో రిలీజ్‌ చేస్తున్నట్లు ఊహగానాలు వస్తున్నాయి.    కాగా ఈ ఫోన్‌ ఐఫోన్​ 12కు తదనంతర ఫోన్‌గా రానుంది.

అమెరికాలో ప్రముఖ చైనా కంపెనీ హువావేపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో ఐఫోన్​ 13 అమ్మకాలు గణనీయంగా ఉండే అవకాశం ఉందని మార్కెట్​ విశ్లేషకులు భావిస్తున్నారు. ఐఫోన్‌-13 సిరీస్‌లో భాగంగా ఐఫోన్‌ 13 మినీ, ఐఫోన్‌ 13 ప్రో, ఐఫోన్‌ 13 ప్రో మ్యాక్స్‌ ఫోన్లను ఆపిల్‌ రిలీజ్‌ చేయనుంది. పెర్ల్‌, సన్‌సెట్‌ గోల్డ్‌ వేరియంట్లతో ఐఫోన్‌-13 రానుంది. 

ఐఫోన్‌-13 ఫీచర్లు

  • ట్రిపుల్‌ కెమెరా విత్‌ లేజర్‌ సెన్సార్‌, ఎల్‌ఈడీ ఫ్లాష్‌
  • లైడార్‌ సెన్సార్‌
  • 5 జీ కనెక్టవిటీ సపోర్ట్‌
  • వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌
  • పవర్‌ ఎఫిసియంట్‌ ఎల్‌టీవో డిస్‌ప్లే
  • ఏ15 బయోనిక్‌ చిప్‌సెట్‌ అండ్‌ అల్వేస్‌ ఆన్‌ డిస్‌ప్లే
  • ఐఫోన్ 13 మినీ- 2,406 ఎంఏహెచ్ బ్యాటరీ
  • ఐఫోన్ 13,  ఐఫోన్ 13 ప్రో-3,095 ఎంఏహెచ్ బ్యాటరీ
  • ఐఫోన్ 13 ప్రో మాక్స్ -4352 ఎంఏహెచ్ బ్యాటరీ 
Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు