ఐఫోన్‌13 ఫీచర్లు హల్‌చల్‌

7 Nov, 2020 14:46 IST|Sakshi

 ఐఫోన్12  ధర కంటే తక్కువ ధరకే

సాక్షి, న్యూఢిల్లీ: ఆపిల్ ఐఫోన్ 12 లాంచ్‌ అయిన నెలరోజుల అయిందో లేదో అపుడే ఆపిల్ ఐఫోన్‌13 పై  పలు నివేదికలు హల్‌చల్‌ చేస్తున్నాయి.  ఆపిల్ విశ్లేషకుడు మింగ్-చి కుయో ప్రకారం టెక్‌ దిగ్గజం, ఐఫోన్‌ తయారీదారు  ఆపిల్ 2021లో ఐఫోన్‌ 13ను ఆవిష్కరించనుంది.  స్వల్ప మార్పులతో ఐఫోన్‌ 12 తరహాలోనే,  నాలుగు వేరియంట్లలో దీన్ని విడుదల చేయాలని భావిస్తోంది. 
  
తాజా అంచనా ప్రకారం ఐఫోన్ 13 ఫీచర్లపై అంచనాలు:
2021 ఐఫోన్లను పూర్తిగా వైర్‌లెస్ అనుభవంతో 5.4,  6.1, 6.7 అంగుళాల స్క్రీన్లతో మూడు పరిమాణాల్లో నాలుగు మోడల్స్‌ లాంచ్ చేయనుంది.  రెండింటిని "ప్రో" మోడల్స్ గాను, మిగిలినవి బేసిక్‌ మోడల్స్‌గా రానున్నాయి.  ఐఫోన్ 13లో  వేగవంతమైన  ఏ సిరీస్‌, క్వాల్కం  కొత్త చిప్‌ సెట్‌ను జోడించనుంది. అలాగే  కెమెరాసెటప్‌ను కూడా భారీగా అప్‌డేట్‌ చేయనుంది. కెమెరా టెక్నాలజీ పరంగా,  హై-ఎండ్ 40 నుండి 64 మెగాపిక్సెల్ కెమెరా లెన్స్‌లతో పాటు నాలుగు కెమెరాలనుఅమర్చనుంది. ఇంకా పోర్టింగ్ లెస్ డిజైన్‌,  వైర్‌లెస్ ఛార్జింగ్, ఫేస్ఐడి  ఆన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్  లాంటి ఫీచర్లను సెటప్‌లను చూడవచ్చు.

5జీ చిప్ విషయానికి వస్తే, ఆపిల్ 2021 ఐఫోన్‌లో క్వాల్కమ్  కొత్త స్నాప్‌డ్రాగన్ ఎక్స్ 60 మూడవ తరం 5 జీ మోడెమ్‌ను ఉపయోగించవచ్చు. అలాగే  రాబోయే మరిన్ని ఐఫోన్లలో కూడా ఎక్స్ 65, ఎక్స్ 70 క్వాల్కమ్ మోడెమ్ చిప్‌లను  వినియోగించనుంది.  అంతేకాదు ఐఫోన్ 12 ధరతో పోలిస్తే సాఫ్ట్ బ్యాటరీ బోర్డ్ డిజైన్‌ద్వారా దాదాపు 30 నుంచి 40 శాతం రేటును తగ్గించనుందనే ఊహాగానాలు ఐఫోన్‌ ప్రేమికులకు ఊరటనిస్తున్నాయి. 

మరిన్ని వార్తలు