ఐఫోన్ 15 సిరీస్ ఫస్ట్ సేల్ షురూ.. ఉదయం నుంచే వెయిట్ చేస్తున్న కస్టమర్లు!

22 Sep, 2023 12:01 IST|Sakshi

ఐఫోన్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 15 సిరీస్ సేల్ ప్రారంభమయ్యాయి. యాపిల్ స్టోర్స్ ఓపెన్ చేయకముందు నుంచే కొనుగోలుదారు బయట బారులుతీరారు. దీనికి సంబంధించిన ఫోటోలు & వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఢిల్లీ, ముంబై నగరాల్లో యాపిల్ స్టోర్ల ప్రారంభోత్సవం తర్వాత ఐఫోన్ లాంచ్ కావడం ఇదే మొదటిసారి. ఉదయం 8 గంటలకు స్టోర్ ప్రారంభమైంది.. కస్టమర్లను బ్యాచ్‌ల వారీగా ఆహ్వానిస్తున్నారు. చాలామంది కస్టమర్లు ఉదయం 3 గంటల నుంచే ఎదురు చూస్తున్నట్లు సమాచారం.

యాపిల్ కంపెనీ ఇటీవలే ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్ అనే మోడల్స్ లాంచ్ చేసింది. వీటి ధరలు ఎందుకునే స్టోరేజ్ కెపాసిటీని బట్టి ఉంటుంది. ఇవి మొత్తం ఐదు కలర్ ఆప్షన్లలో లభిస్తాయి.

ఇదీ చదవండి: భారత్‌లో ప్రవేశించడానికి టెస్లా కొత్త వ్యూహం! ఇదే జరిగితే..

కొత్త ఐఫోన్ 15 ప్రో, ప్రో మ్యాక్స్ మోడల్స్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించడం ద్వారా రూ. 6000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఇతర మోడల్స్ మీద రూ. 5000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. కొత్త మోడల్స్ మీద మాత్రమే కాకుండా ఐఫోన్ 14, 13 సిరీస్‌ల మీద కూడా రూ. 4000 & రూ. 3000 తగ్గింపు లభిస్తుంది.

మరిన్ని వార్తలు