అదిరిపోయిన ఐఫోన్ తయారీ సంస్థ ఎలక్ట్రిక్ కార్లు

18 Oct, 2021 21:08 IST|Sakshi

భారత్‌లో ఆపిల్ ఐఫోన్లను తయారు చేస్తున్న తైవాన్‌కు చెందిన కాంట్రాక్ట్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ సంస్థ ఫాక్స్‌కాన్‌ ఎలక్ట్రిక్ మార్కెట్లోకి అడుగు పెట్టబోతుంది. తైవాన్ ఫాక్స్‌కాన్‌ కంపెనీ త్వరలో మార్కెట్లోకి తీసుకొని రానున్న మొదటి మూడు ఎలక్ట్రిక్ వాహన నమూనాలను నేడు ఆవిష్కరించింది. ప్రముఖ తైవాన్‌ కార్ల తయారీ సంస్థ యులోన్ మోటార్ కో లిమిటెడ్, ఫాక్స్‌కాన్‌ మధ్య చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఫాక్స్ ట్రాన్ పేరుతో ఎలక్ట్రిక్ ఎస్‌యువి, సెడాన్, బస్సు తయారు చేయనున్నారు. 

ఫాక్స్ ట్రాన్ వైస్ ఛైర్మన్ విలేకరులతో మాట్లాడుతూ.. వచ్చే ఐదు ఏళ్లలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ 35 బిలియన్ డాలర్లకు చెరనుంది అని అన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ తయారీదారు అయిన ఫాక్స్‌కాన్‌ ప్రపంచ ఈవి మార్కెట్లో ప్రధాన నాయకుడిగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. నవంబర్ 2019లో ఈవీ ఆలోచన గురుంచి పేర్కొంది. భవిష్యత్తు డిమాండ్ దృష్టిలో పెట్టుకొని ఎలక్ట్రిక్ మార్కెట్లోకి అడుగుపెట్టినట్లు ఫాక్స్‌కాన్‌ తెలపింది. ఈ ఎలక్ట్రిక్ వాహనాలు చూడాటానికి కూడా చాలా భిన్నంగా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ఈ వీడియోను వీక్షించండి.(చదవండి: ఐఫోన్‌ యూజర్లకు హెచ్చరిక...!)

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు