యాపిల్‌ నుంచి తొలిసారి హెడ్‌ఫోన్స్‌

9 Dec, 2020 14:11 IST|Sakshi

ఎయిర్‌పోడ్స్‌ మ్యాక్స్‌ పేరుతో దేశీయంగా విడుదల

ఆన్‌ఇయర్‌ వైర్‌లెస్‌ హెడ్‌ఫోన్స్‌ విక్రయాలు షురూ

దేశీయంగా ధర రూ. 59,900

యాపిల్‌ వెబ్‌సైట్‌, అధీకృత విక్రేతల ద్వారా అందుబాటు

ముంబై‌, సాక్షి: మొబైల్‌ ఫోన్ల రంగంలో ప్రపంచ దిగ్గజ సంస్థ ‘ఆపిల్‌’ కంపెనీ నుంచి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వైర్‌లెస్‌ హెడ్‌ ఫోన్లు డిసెంబర్‌ 15వ తేదీ నుంచి మార్కెట్లోకి రానున్నాయి. 2016లో తీసుకొచ్చిన ఏర్‌పాడ్స్‌ మ్యాక్స్‌ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ హెడ్‌ఫోన్ల కోసం ఈ క్షణం నుంచే బుకింగ్‌ చేసుకోవచ్చు. అయితే డిసెంబర్‌ 15 తర్వాతే దిగుమతి, ఎగుమతులను అనుమతిస్తారు. వీటి ధరను 549 పొండ్లు (53 వేల రూపాయలు)గా నిర్ణయించారు. 

ఏర్‌పాడ్స్‌ 159 పౌండ్లు, ఏర్‌పాడ్స్‌ ప్రోను 249 పొండ్లకు విక్రయించగా హెడ్‌ ఫోన్లకు వాటికన్నా ఎక్కువ ధరను ఖరారు చేశారు. ఇందులో బయటి నుంచి వచ్చే ధ్వనులను గణనీయంగా తగ్గించడంతోపాటు వినేవారి చెవుల నిర్మాణం తీరునుబట్టి లో ఫ్రీక్వెన్సీ లేదా మధ్యస్థ ఫ్రీక్వెన్సీలోకి దానంతట అదే మారేందుకు హెడ్‌ఫోన్ల అవుట్‌ పుట్‌ను మార్చేందుకు అందులో ‘అడాప్టివ్‌ ఈక్యూ’ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఆపిల్‌ కంపెనీ వర్గాలు వివరించాయి. 

ఆకుపచ్చ, నీలి, గులాబీ, గోధుమ, రజితం రంగుల్లో హెడ్‌ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. అంతకు ఒక్క రోజు ముందు నుంచి, అంటే డిసెంబర్‌ 14వ తేదీ నుంచి కొత్త ఫిట్‌నెస్‌ యాప్‌ను ఆపిల్‌ కంపెనీ అందుబాటులోకి తెస్తోంది. నెలకు దీని సబ్‌ స్క్రిప్షన్‌ 9.99 పౌండ్లకు (989 రూపాయలు), అలాగే 9.99 డాలర్లకు సబ్‌స్క్రిప్షన్లు అందుబాటులో ఉంటాయని,  ఈ యాప్‌ ద్వారా వివిధ రకాల ఫిట్‌నెస్‌ వీడియోలను, యోగా , డ్యాన్సింగ్‌   వీడియోలను వీక్షించవచ్చని కంపెనీ వర్గాలు తెలిపాయి.

తాజా అమ్మకాలలో భాగంగా 25 దేశాలు, ప్రాంతాలకు వీటిని అందించనున్నట్లు వెల్లడించింది. ఐప్యాడ్లు తదితర యాపిల్‌ డివైస్‌లు ఐవోఎస్‌ 14.3 లేదా తదుపరి అప్‌గ్రేడ్‌తో పనిచేస్తాయని ఐఫోన్ల దిగ్గజం యాపిల్‌ పేర్కొంది. మ్యాక్‌ ఓఎస్‌ బిగ్‌ 11.1 లేదా తదుపరి అప్‌గ్రేడ్స్‌ ద్వారా వీటిని వినియోగించుకోవచ్చని వివరించింది. యాపిల్‌ వాచీలయితే ఓఎస్‌ 7.2, టీవీలకు ఓఎస్‌14.3 కంపాటిబుల్‌గా పేర్కొంది. చదవండి: (రూ. 13,000లలో నోకియా లేటెస్ట్‌ ఫోన్)

హెచ్‌1 చిప్‌
ప్రపంచవ్యాప్తంగా హెడ్‌ఫోన్స్‌లో ఎయిర్‌పోడ్స్‌ జనాదరణ పొందినట్లు యాపిల్‌ సీనియర్‌ వైస్‌ప్రెసిడెంట్‌ గ్రెగ్‌ జాస్వియక్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎయిర్‌పోడ్స్‌ మ్యాక్స్‌ ద్వారా అత్యంత నాణ్యతమైన ఆడియో ఎక్స్‌పీరియన్స్‌ను పొందవచ్చని తెలియజేశారు. ఆధునిక డిజైన్‌, ప్రతిభావంతమైన హెచ్‌1 చిప్‌, అడ్వాన్స్‌డ్‌ సాఫ్ట్‌వేర్‌ తదితరాల కారణంగా వినియోగదారులు అత్యుత్తమ వైర్‌లెస్‌ ఆడియోను ఆనందించవచ్చని వివరించారు. ఎడాప్టివ్‌ ఈక్విలైజర్‌ కలిగి ఉన్నట్లు తెలియజేశారు. మూడు మైక్రోఫోన్ల ద్వారా అనవసర శబ్దాలను తగ్గిస్తుందని(నాయిస్‌ రిడక్షన్‌) పేర్కొన్నారు. కానీ దీని ధరపై కొంత మంది నిపుణులతో పాటు, ఆపిల్ లవర్స్ కూడా పెదవి విరుస్తున్నారు.  

మరిన్ని వార్తలు