భారీ షాక్‌, ఒక్క నిర్ణయంతో నష్టాల్ని మూటగట్టుకుంటున్న యాపిల్‌!

11 Mar, 2022 13:24 IST|Sakshi

ఉక్రెయిన్‌పై చేస్తున్న దాడుల్ని ఖండిస్తూ ప్రపంచ దేశాలకు చెందిన దిగ్గజ కంపెనీలు రష్యాలో కార‍్యకలాపాల్ని నిలిపివేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌ సైతం రష్యాలో ఐఫోన్‌ అమ్మకాల్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటన యాపిల్‌కు తీవ్ర నష్టాల్ని మిగిల్చుతున్నట్లు తెలుస్తోంది

రష్యాలో యాపిల్‌ సేవల్ని నిలిపిస్తున్నట్లు ప్రకటించడంపై లిథువేనియాకు చెందిన ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్ బుర్గా స్పందించింది. రష్యాలో యాపిల్‌ కార్యకలాపాలు ఆగిపోతే.. టెక్‌ దిగ్గజానికి ఎలాంటి నష్టం వాటిల్లుతుందనే అంశంపై ఓ అంచనా వేసింది. ఆ అంచనా ప్రకారం.. యాపిల్‌ సంస్థ రష్యాలో ఐఫోన్‌ల అమ్మకాల్ని నిలిపివేడయంతో ప్రతీ రోజూ 3 మిలియన్‌ డాలర్లు, సంవత్సరానికి 1.14 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని కోల్పోతున్నట్లు బుర్గా సంస్థ అంచనా వేసింది. 

ఇక మిగిలిన స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీల వాటాల విషయానికొస్తే దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్ 34 శాతంతో రష్యాలో అగ్రస్థానంలో ఉండగా, షావోమీ  26 శాతంతో మూడో స్థానంలో, రియల్‌ మీ 8 శాతం, పోకో 3 శాతం, ఇతర చిన్న బ్రాండ్‌లు 14 శాతం వాటా కలిగి ఉన్నాయని బుర్గా నివేదిక పేర్కొంది. కాగా, గత కొన్ని సంవత్సరాలుగా రష్యా సాధారణ స్మార్ట్‌ఫోన్ అమ్మకాల ఆదాయం క్రమంగా పెరుగుతోందని, వాటిని పరిగణనలోకి తీసుకుంటే యాపిల్‌  ఆదాయం ఎక్కువగా ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది. 

చదవండి: ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్.. రూ.50 వేల యాపిల్ ఐఫోన్ రూ.10 వేలకే..!

మరిన్ని వార్తలు