ఐఫోన్‌ 15 సిరీస్‌పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. కలర్స్‌పై ఓ లుక్కేయండి!

25 Feb, 2023 12:04 IST|Sakshi

ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌ గత ఏడాది సెప్టెంబర్‌లో ఐఫోన్‌ 14 సిరీస్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ ఫోన్‌ విడుదలై కొనుగోలు దారుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఐఫోన్‌ 14 కంటే తదుపరి సిరీస్‌ ఐఫోన్‌ 15లో లేటెస్ట్‌ టెక్నాలజీ జోడించడంతో పాటు వివిధ రకాలైన కలర్స్‌తో మార్కెట్‌కు పరిచయం చేయాలని యాపిల్‌ సంస్థ  భావిస్తోంది. 

ఈ తరుణంలో ఐఫోన్‌ 15 సిరీస్‌లో వనిల్లా  కొత్త వేరియంట్స్‌ కలర్స్‌తో మార్కెట్‌కు పరిచయం చేయనున్నట్లు ‘9 టూ 5 మాక్‌’ నివేదిక తెలిపింది. వనిల్లా ఐఫోన్‌ 15 సిరీస్‌లో డార్క్‌ పింక్‌, లైట్‌ బ్లూ కలర్స్‌తో పాటు సెల్ఫీ జనరేటెడ్‌ రెండర్‌ ఇమేజ్‌ లేటెస్ట్‌ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు సమాచారం. దీనికి తోడు పింక్, లైట్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో వనిల్లా ఐఫోన్ 15 ఇమేజ్‌లను విడుదల చేయడంపై ఆసక్తి మరింత పెరిగింది. ఐఫోన్‌ 15సిరీస్‌లో బ్లాక్‌ , వైట్‌, రెడ్‌ వేరియంట్స్‌ కలర్స్‌తో మార్కెట్‌కు పరిచయం కానుందని నివేదికలు చెబుతున్నాయి. కానీ లేటెస్ట్‌ కలర్స్‌పై యాపిల్‌ స్పందించలేదు.  

ఇక రిపోర్ట్‌ల ప్రకారం.. ఈ ఏడాది ఐఫోన్‌ 15 ప్రో మోడల్స్‌ను స్పెషల్‌ కలర్స్‌ లాంచ్‌ చేయనుంది. ముఖ్యంగా ఐఫోన్‌ 15 ప్రో, ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌/ ఆల్ట్రా మోడల్స్‌లో డార్క్‌ రెడ్‌ కలర్స్‌తో టైటానియం ఫినిష్‌తో రానుంది. ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్ డిస్‌ప్లేల చుట్టూ తిన్నర్‌ బెజెల్స్‌, ఐఫోన్‌ 14 తరహా స్క్రీన్‌ను పోలి ఉండనుందని గతంలోనే పలు నివేదికలు తెలిపాయి. తాజా నివేదికలు సైతం యాపిల్‌ వాచ్‌ తరహా డిజైన్‌లతో థిన్‌ బెజెల్స్‌, కర్డ్వ్ షేప్స్‌తో విడుదల కానున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు