యాపిల్‌ మాస్టర్‌ప్లాన్‌...అందరికీ అందుబాటులో ఐఫోన్‌..! కొనడం మరింత ఈజీ..!

25 Mar, 2022 11:44 IST|Sakshi

యాపిల్‌ కంపెనీకి చెందిన ఉత్పత్తులకు ఆదరణ మామూలుగా ఉండదు.ఇతర మొబైల్‌ ఫోన్లతో పోలిస్తే యాపిల్‌ ఐఫోన్లకు సాటి లేదు. కొంతమందైతే ఐఫోన్లను దర్పంలాగా కూడా వాడుతుంటారు. యాపిల్‌ ఐఫోన్లను సొంతం చేసుకోవాలని అందరికీ ఉంటుంది. అధిక ధర ఉండడంతో చాలామంది ఐఫోన్లను కొనడానికి వెనకడుగు వేస్తూ ఉంటారు. కాగా  ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్లను అందరికీ  అందుబాటులో ఉంచేందుకు యాపిల్‌ సరికొత్త ప్రణాళికలను రచిస్తోంది. 

సబ్‌స్క్రిప్షన్‌ బేస్డ్‌ సర్వీస్‌..!
సబ్‌స్క్రిప్షన్‌ బేస్డ్‌ సర్వీస్‌ రూపంలో ఐఫోన్‌, ఇతర హార్డ్‌వేర్‌ ఉత్పత్తులను విక్రయించాలని యాపిల్‌ భావిస్తోన్నట్లు సమాచారం. ఈ సర్వీసులో భాగంగా తొలుత ఐఫోన్‌, ఐప్యాడ్‌లను యాపిల్‌ విక్రయించనుంది. ఇక్కడ కస్టమర్‌లు సంప్రదాయ పద్ధతి(ఈఎంఐ)లో కొనుగోలు చేయడానికి బదులుగా నెలవారీ యాప్ రుసుమును చెల్లిస్తారు. బ్లూమ్‌బెర్గ్ కథనం ప్రకారం..యాపిల్‌ హార్డ్‌వేర్ సబ్‌స్క్రిప్షన్ సేవ ఇంకా అభివృద్ధిలో ఉందని నివేదించింది.  కాగా ఈ ఏడాది చివరిలో సబ్‌స్రిప్షన్‌ బేస్డ్‌ సర్వీసులను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. యాపిల్‌  ఉత్పత్తులను సబ్‌స్క్రిప్షన్‌ బేస్డ్‌ సర్వీసుల్లో అమ్మడం ద్వారా కంపెనీకి భారీగా కలిసొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  ఈ సర్వీసులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

ఆయా మార్కెట్లలో కొనుగోలుదారులు యాపిల్‌ కార్డ్ ద్వారా హార్డ్‌వేర్ ఉత్పత్తుల కొనుగోలుకు ఆర్థిక సహాయం చేయడానికి అనుమతిస్తుంది. దీనిలో ఐఫోన్ అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్ కూడా ఉంది. వీటి ద్వారా కస్టమర్‌లు, ఎంపిక చేసిన దేశాలలో, ఎటువంటి అదనపు ఖర్చులు చెల్లించాల్సిన అవసరం లేకుండా పాత ఐఫోన్లను ఎక్సేఛేంజ్‌ చేయడం ద్వారా ప్రతి సంవత్సరం కొత్త ఐఫోన్‌ను పొందవచ్చు.

భారీ ఆదాయాలు..!
యాపిల్‌కు సబ్‌స్క్రిప్షన్‌ బేస్డ్‌ సర్వీసులు చాలా ముఖ్యమైనవి. ఇప్పటి వరకు Apple Music, iCloud, Apple TV Plus, Apple Fitness Plus, Apple Arcade వంటి యాప్‌ సేవలను  యాపిల్‌ తన యూజర్లకు అందిస్తోంది. వీటన్నింటిని యాపిల్‌ వన్‌ పేరుతో బండిల్‌ సబ్‌స్క్రిప్షన్‌ సేవలు యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా కంపెనీకి భారీ ఆదాయం సమాకురుతోంది. ఇదే తరహాలో థర్డ్‌ పార్టీ సంస్థలకు దూరంగా ఉంటూ ఐఫోన్‌, ఐప్యాడ్‌ అమ్మకాలను జరపాలని యాపిల్‌ భావిస్తోన్నట్లు సమాచారం.

చదవండి: ఐఫోన్‌ను తలదన్నేలా బెస్ట్‌ ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌..! నథింగ్‌ నుంచి..! లాంచ్‌ ఎప్పుడంటే..?

మరిన్ని వార్తలు