యాపిల్‌ దిమ్మతిరిగే టెక్నాలజీ.. మడత ఐఫోన్లు కింద పడినా ఏమీ కావు!

18 Mar, 2023 17:23 IST|Sakshi

ప్రీమియం ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాల తయారీ దిగ్గజం యాపిల్‌ దిమ్మతిరిగే సరికొత్త టెక్నాలజీని తీసుకొస్తోంది. ఈ టెక్నాలజీ ఐఫోన్లు, ఐపాడ్‌లు కింద పడినా ఏమీ కాకుండా రక్షిస్తుంది. ఫోన్లు కింద పడే సందర్భంలో వీటికున్న సెన్సర్లు వెంటనే గ్రహించి వాటి ఫ్లెక్సిబుల్ స్క్రీన్‌లు మడతపడేలా చేస్తాయి. దీంతో ఫోన్‌ కింద పడినా స్క్రీన్లకు ఎటువంటి దెబ్బా తగలదు.

ఇదీ చదవండి: పెళ్లి ఖర్చులకు డబ్బు కావాలా? ఈపీఎఫ్‌ నుంచి ఇలా తీసుకోండి..

‘సెల్ఫ్-రిట్రాక్టింగ్ డిస్‌ప్లే డివైస్ అండ్ టెక్నిక్స్ ఫర్ ప్రొటెక్టింగ్ స్క్రీన్‌ యూజింగ్‌ డ్రాప్ డిటెక్షన్’ పేరుతో అభివృద్ధి చేస్తున్న ఈ కొత్త టెక్నాలజీపై యాపిల్‌ సంస్థ పేటెంట్‌ కోసం దరఖాస్తు చేసినట్లు తెలిసింది. ఈ టెక్నాలజీ ఎలా పనిచేసేదీ కంపెనీ పేటెంట్‌ దరఖాస్తులో పేర్కొంది.

ఇదీ చదవండి: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ విలీనానికి ఎన్‌సీఎల్‌టీ ఆమోదం.. ఇక ఇదే మూడో అతిపెద్ద బ్యాంక్‌!

ఈ టెక్నాలజీలో ఫోల్డబుల్, రోలబుల్‌ డిస్‌ప్లేలు కలిగిన మొబైల్ ఫోన్లు కింద పడిపోతున్నప్పుడు గుర్తించేందుకు సెన్సార్ ఉంటుందని తెలుస్తోంది. ఫోన్‌ కింద పడుతున్నట్లు సెన్సార్ గుర్తించిన వెంటనే అది నేలను తాకే లోపు సున్నితమైన డిస్‌ప్లే నేలకు తగలకుండా ముడుచుకునిపోతుందని కంపెనీ పేర్కొంది. ఇలా ముడుచుకునే క్రమంలో ఫోన్‌లోని రెండు స్క్రీన్‌లకు మధ్య కోణం తగ్గిపోతుంది. దీని వల్ల ఆ స్క్రీన్‌లకు దాదాపుగా దెబ్బ తాకే అవకాశం ఉండదు.

ఇదీ చదవండి: సుందర్‌ పిచాయ్‌.. మాకు న్యాయం చేయండి.. తొలగించిన ఉద్యోగుల బహిరంగ లేఖ

మరిన్ని వార్తలు