భారత్‌లో ఐఫోన్‌ 14 తయారీ, యాపిల్‌ ఊహించని నిర్ణయం!

21 Oct, 2022 18:20 IST|Sakshi

ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌ ఊహించని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. భారత్‌లో ఐఫోన్‌ 14 ప్రీమియం ఫోన్‌లను ఇక్కడ తయారు చేయాలనుకున్న నిర్ణయాన్ని విరమించుకున్నట్లు తెలుస్తోంది.
 
యాపిల్‌ తన సంస్థకు చెందిన ఎక్కువ శాతం ప్రొడక్ట్‌లను చైనాలోనే తయారు చేయిస్తుంది. అయితే, దేశాల మధ్య ఉద్రిక్తతలు, డ్రాగన్‌ కంట్రీలో వైరస్‌ను అరికట్టేందుకు విస్తృతంగా లాక్‌డౌన్‌లను అమలు చేస్తోంది. దీనివల్ల చాలా వ్యాపారాలు దెబ్బతిన్నాయి. అందుకే యాపిల్‌ సంస్థ ఐఫోన్‌ల తయారీని భారత్‌కు మారుస్తున్నట్లు గతంలో ప్రకటించింది.

అందుకే యాపిల్‌ కంపెనీ గత నెలలో  ‘ఐఫోన్ 14ను భారత్‌లో తయారు చేస్తున్నందుకు మేం సంతోషిస్తున్నాం’ అని  తెలిపింది. అయితే ఐఫోన్‌ 14 సిరీస్‌ ఫోన్‌లను భారత్‌లో తయారు చేయడం వాస్తవమే అయినా.. ప్రీమియం ఫోన్‌లను దేశీయంగా తయారు చేసే విషయంలో యాపిల్‌ వెనక్కి తగ్గినట్లు టెక్‌ బ్లాగ్‌ గిజ్మో చైనా తన కథనంలో పేర్కొంది. 

ఐఫోన్‌ 15 భారత్‌లోనే! 
స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థల అంచనాల ప్రకారం..యాపిల్ వచ్చే ఏడాదిలో భారత్‌, చైనాలలో ఒకేసారి ఐఫోన్‌15ను తయారు చేయోచ్చని భావిస్తున్నాయి. 2017లో ఐఫోన్ల తయారీని యాపిల్‌ ఇక్కడ ప్రారంభించింది. భారత్‌లో ఐఫోన్ 11, ఐఫోన్ 12, ఐఫోన్ 13తో పాటు లేటెస్ట్‌ ఐఫోన్‌ 14 ఫోన్‌లను ఇక్కడే తయారు చేయనుంది. దేశంలో విస్ట్రాన్ మ్యానిఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ నుంచి ఐఫోన్ ఎస్ఈ, ఐఫోన్ 12 లను ఉత్పత్తి చేస్తుంది.   

చైన్నై కేంద్రంగా
ఐఫోన్‌  తైవాన్‌ హ్యాండెసెట్‌ తయారీ దిగ్గజ సంస్థలైన విస్ట్రాన్‌ చైనాలో.. ఫాక్స్‌కాన్‌ (చెన్నై) భారత్‌లో కార్యకలాపాల్ని కొనసాగిస్తున్నాయి. యాపిల్‌ సంస్థ ఫాక్స్‌కాన్‌తో ఒప్పందం కుదర్చుకుని చెన్నై కేంద్రంగా ఐఫోన్‌లను తయారు చేస్తున్న విషయం తెలిసిందే.

చదవండి👉 ‘ఐఫోన్’ పరువు తీసిన యాపిల్ బాస్ కూతురు, సమర్ధించిన టిమ్‌ కుక్‌

మరిన్ని వార్తలు