ఆపిల్ భారీ పరిహారం చెల్లింపు

21 Nov, 2020 15:06 IST|Sakshi

టెక్ దిగ్గజం యాపిల్‌పై ఫిర్యాదులు పెరుగుతున్నాయి. ఉద్దేశపూర్వకంగా పాత ఐఫోన్‌ల బ్యాటరీ యొక్క జీవితాన్ని తగ్గిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ బ్యాటరీ సమస్యల విషయంలో కాలిఫోర్నియా మరియు అరిజోనాతో సహా 34 రాష్ట్రాలకు 113 మిలియన్లు డాలర్ల పరిహారం చెల్లించడానికి అంగీకరించింది. ఆపిల్ దాని 2017లో కొన్న ఐఫోన్ బ్యాటరీ సమస్యల పరిష్కార విషయంలో పారదర్శకంగా వ్యవహరించడం లేదని టెక్ నిపుణలు ఆరోపిస్తున్నారు. "పెద్ద టెక్ కంపెనీలు వినియోగదారులను అయోమయం గురి చేయడం మానేసి, వినియోగదారులు వాడుతున్న ఉత్పత్తుల గురించి పూర్తి నిజం వారికి చెప్పాలి" అని దర్యాప్తుకు నాయకత్వం వహించిన అరిజోనా అటార్నీ జనరల్ మార్క్ బ్ర్నోవిచ్ గురువారం ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. (చదవండి: అత్యంత చవకైన డ్యూయల్ 5జీ ఫోన్

2017లో పాత ఐఫోన్ల పనితీరును తగ్గించేలా ఆపరేటింగ్ సిస్టంలో మార్పులు చేసిన మాట నిజమేనని సంస్థ అంగీకరించింది. అమెరికాలో యాపిల్‌పై కొందరు వినియోగదారులు దావాలు కూడా వేశారు. పాత బ్యాటరీలు మార్చుకునే వారికి తక్కువ ధరకే కొత్త బ్యాటరీలు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. బ్యాటరీ పనితీరును ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు కొత్త ఏడాదిలో ఓ కొత్త సాఫ్ట్‌వేర్‌ను తీసుకురానున్నట్లు వివరించింది. వెబ్‌సైట్‌లో సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, ఐఫోన్‌ బ్యాటరీ ధరను 79 డాలర్ల నుంచి 29 డాలర్లకు, అంటే దాదాపు 63 శాతం తగ్గిస్తున్నట్లు యాపిల్ పేర్కొంది. "మీలో కొంతమంది ఆపిల్ మిమ్మల్ని నిరాశపరిచినట్లు మాకు తెలుసు. మేము క్షమాపణలు కోరుతున్నాము" అని కంపెనీ 2017 ప్రకటనలో తెలిపింది. పాత ఐఫోన్లు మరింత కాలం మన్నాలనే ఉద్దేశంతోనే తాము ఆపరేటింగ్ సిస్టంలో మార్పులు చేశామని, కానీ దీనిపై వినియోగదారుల్లో అనేక సందేహాలు తలెత్తినట్లు యాపిల్ చెప్పుకొచ్చింది. 

ఈ ఏడాది మార్చిలో, ఆపిల్ ఒక క్లాస్ యాక్షన్ దావాను పరిష్కరించడానికి 500 మిలియన్ డాలర్ల వరకు చెల్లించడానికి అంగీకరించింది. ఇప్పుడు రెండోసారి ది వాషింగ్టన్ పోస్ట్‌లోని ఒక నివేదిక ప్రకారం, ఆపిల్ రెండవ సారి సమస్య పరిష్కారానికి కాలిఫోర్నియా మరియు అరిజోనాతో సహా 34 రాష్ట్రాలకు 113 మిలియన్లు డాలర్ల పరిహారం చెల్లించడానికి అంగీకరించింది. 

మరిన్ని వార్తలు