39 వేల చైనా యాప్ లను నిషేదించిన యాపిల్

3 Jan, 2021 20:45 IST|Sakshi

అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ చైనాకు భారీ షాక్ ఇచ్చింది. చైనా యాప్ స్టోర్ నుండి యాపిల్ 39 వేల యాప్‌లను తొలిగించినట్లు పేర్కొంది. 2020 ఏడాది చివరి రోజు వరకు తిరిగి లైసెన్స్‌ను పొందలేని కారణంగా యాప్ లను నిషేధించినట్లు పేర్కొంది. చైనాకు చెందిన కొన్ని అథారిటీలు లైసెన్స్‌ లేని యాప్‌లను నిషేధించాలని పేర్కొన్నాయి. దీంతో వీటిని నిషేధించినట్లు పేర్కొంది. ఆపిల్ ప్రారంభంలో గడువును జూన్ చివరి వరకు ఇచ్చింది. తరువాత అది డిసెంబర్ 31 వరకు పొడిగించబడింది. వీటితో పాటు మరో 7 వేల యాప్ లను నిషేధించినట్లు పేర్కొంది. లైసెన్స్‌పై నిబంధనల గురించి చైనా తీవ్రంగా ఆలోచించడం ఇది కొత్త కాదు. కానీ ఈ సంవత్సరం ఆపిల్ వారిని మరింత కఠినంగా ఎందుకు బలవంతం చేస్తోందో అర్థం కాలేదు. యాపిల్ నిషేదించిన యాప్ లలో కొన్ని ప్రముఖ యాప్ లు కూడా ఉన్నాయి. వీటిలో ఎన్‌బిఎ 2కె20 కి చెందిన గేమ్స్‌, యూబీ సాఫ్ట్‌ టైటిల్‌ అసాసిన్‌కు చెందిన క్రీడ్‌ ఐడెంటిటి కూడా ఈ నిషేదిత జాబితాలో ఉన్నాయి.(చదవండి: గుడ్ న్యూస్.. 'ఫౌజీ' గేమ్ ట్రైలర్‌ వచ్చేసింది!)
       

మరిన్ని వార్తలు