ఐఫోన్‌ యూజర్లకు ఆపిల్‌ హెచ్చరికలు ! అందులో నిజమెంత?

11 Sep, 2021 20:13 IST|Sakshi

ఐఫోన్‌ యూజర్లకు యాపిల్‌ సంస్థ హెచ్చరికలు జారీ చేసిందనే కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. వాహన దారులు టూవీలర్‌ డ్రైవింగ్‌ సమయంలో ఐఫోన్‌ను బైక్‌కు అటాచ్‌ చేయడం వల్ల హైపవర్‌ మోటర్‌ సైకిల్‌ నుంచి ఉత్పన్నమయ్యే వైబ్రేషన్స్‌తో స్మార్ట్‌ఫోన్‌ కెమెరాలు దెబ్బతినే అవకాశం ఉందని ఆపిల్‌ సంస్థ సపోర్ట్‌ డాక్యుమెంట్‌లో వెల్లడించిందనే సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది.   
  
ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్‌) లేదా క్లోజ్డ్-లూప్ ఆటోఫోకస్‌తో ఐఫోన్ కెమెరా లెన్స్‌లు దెబ్బతినే అవకాశం ఉందని ఆపిల్‌ సంస్థ తెలిపినట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న కథనాల్లో పేర్కొన్నాయి. ఈ సమస్యను అదిగమించేందుకు ఐఫోన్‌ యూజర్లు గైరోస్కోప్‌లు లేదా మాగ్నెటిక్ సెన్సార్‌లను ఉపయోగించాలని ఆపిల్‌ తన సపోర్ట్‌ డాక్యుమెంట్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. 

అంతేకాదు టూవీలర్‌ నుంచి వచ్చే శబ్ధ తరంగాల వైబ్రేషన్‌లు తీవ్రంగా ఉంటాయని, కాబట్టి వినియోగదారులు ఐఫోన్‌లను నేరుగా వెహికల్‌ కు అటాచ్‌ చేయోద్దని ఆపిల్ సిఫార్సు చేసిందనే కథనాలపై ఆపిల్ స్పష్టత ఇవ్వాలని నెటిజన్లు కోరుతున్నారు.ఎందుకంటే గత కొన్నేళ్లుగా ఐఫోన్‌లను బైక్‌లకు అటాచ్‌ చేయడం వల్ల కెమెరా దెబ్బతింటుందనే కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం వైరల్‌ అవుతున్న కథనాలపై ఆపిల్‌ సంస్థ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.    

చదవండి: స్పేస్‌ఎక్స్‌: నలుగురు మనుషులు,కక్ష్యలో 3 రోజుల ప్రయాణం

మరిన్ని వార్తలు