5జీ ఐఫోన్‌ 12 వచ్చేసింది..

14 Oct, 2020 03:59 IST|Sakshi

ఐఫోన్‌ 12 ధర 799 డాలర్ల నుంచి ప్రారంభం

అయిదు రంగుల్లో లభ్యం

ఐఫోన్‌ 12 మినీ రేటు 699 డాలర్ల నుంచి...

కాలిఫోర్నియా: టెక్‌ దిగ్గజం యాపిల్‌ తాజాగా తమ 5జీ టెక్నాలజీ ఆధారిత ఐఫోన్‌ 12, ఐఫోన్‌ 12 మినీ, ప్రో, ప్రో మ్యాక్స్‌ స్మార్ట్‌ఫోన్లను ఆవిష్కరించింది. ఐఫోన్‌ 12 మినీ రేటు 699 డాలర్ల నుంచి, ఐఫోన్‌ 12 రేటు 799 డాలర్ల నుంచి ప్రారంభమవుతుంది. మినీ పరిమాణం 5.4 అంగుళాలు, ఐఫోన్‌ 12 స్క్రీన్‌ 6.1 అంగుళాలు కాగా, ప్రో స్క్రీన్‌ సైజు 6.1 అంగుళాలు, ప్రో మ్యాక్స్‌ డిస్‌ప్లే 6.7 అంగుళాలుగా ఉంటుంది. ఐఫోన్‌ 12 నలుపు, తెలుపు, ఎరుపు తదితర అయిదు రంగుల్లో లభిస్తుంది. ఐఫోన్‌ 11తో పోలిస్తే ఇది 11 శాతం నాజూకైనది, 16 శాతం తేలికైనది. ఇందులో రెట్టింపు పిక్సెల్స్‌ ఉంటాయి.

మరింత దృఢమైన సెరామిక్‌ షీల్డ్‌తో తయారైంది. స్మార్ట్‌ డేటా మోడ్‌ కారణంగా అవసరాన్ని బట్టి ఇది 5జీ, ఎల్‌టీఈ నెట్‌వర్క్‌పై పనిచేస్తుంది.  6.1 అంగుళాల ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే, డ్యుయల్‌ కెమెరా, అత్యంత శక్తిమంతమైన ఏ14 బయోనిక్‌ చిప్‌ మొదలైన ఫీచర్లు ఐఫోన్‌ 12లో ఉంటాయి. ఐఫోన్‌ బాక్స్‌లో ఇకపై అడాప్టర్‌ ఉండదని సంస్థ తెలిపింది. 5జీని అత్యంత వేగవంతమైన, అధునాతనమైన టెక్నాలజీగా కంపెనీ సీఈవో టిమ్‌ కుక్‌ అభివర్ణించారు. ఐఫోన్లతో పాటు హోమ్‌ పాడ్‌ మినీ తదితర ఉత్పత్తులను కూడా యాపిల్‌ ఆవిష్కరించింది. అక్టోబర్‌ 16 నుంచి ప్రి–అర్డర్లు, 23 నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయి. 

>
మరిన్ని వార్తలు