Apple iphones: అయ్యో! టిమ్‌ కుక్‌..ఇక ఆ కథ ముగిసినట్టే!

10 Sep, 2022 16:03 IST|Sakshi

న్యూఢిల్లీ: రిఫర్బిష్‌డ్‌ ఐఫోన్లు (వినియోగించిన లేదా సెకండ్‌హ్యాండ్‌ ఫోన్లు) భారత మార్కెట్లో డంప్‌ చేయాలన్న వ్యూహాలకు ఆపిల్‌ చెక్‌  చెప్పింది. రిఫర్బిష్‌డ్‌ ఐఫోన్లను దిగుమతి చేసుకుని భారత్‌లో అమ్మేందుకు మేక్ ఇన్ ఇండియా వ్యూహంలో భారత ప్రభుత్వం నిరాకరించింది. అంతేకాదు ఇ-వ్యర్థాల ఉత్పత్తికి సంబంధించిన ఆందోళనల కారణంగా సెకండ్‌హ్యాండ్‌ ఐఫోన్ల దిగుమతికి ఆపిల్‌ అభ్యర్థనను కేంద్రం తిరస్కరించిన నేపథ్యంలో ఇలాంటి  ఐఫోన్లను  విక్రయించే ప్రణాళికలను ఆపిల్ రద్దు చేసుకున్నట్టు  విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.  (Tata Group: ఐఫోన్‌ లవర్స్‌కు అదిరిపోయే వార్త: అదే నిజమైతే..!)

భారత్‌లో ఆపిల్‌ స్టోర్లు, సెకండ్‌హ్యాండ్‌ ఐఫోన్ల దిగుమతి విక్రయాల ద్వారా వినియోగదారులకు మరింత చేరువకావడంతోపాటు, ఇక్కడి అతిపెద్ద స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో విస్తరించాలనేది  ఆపిల్  సీఈవో టిమ్ కుక్ ప్రణాళిక. ఈ క్రమంలో ఆపిల్ గత కొన్నేళ్లుగా సెకండ్ హ్యాండ్ ఐఫోన్‌లను దిగుమతి,విక్రయాల అనుమతిపై ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. తక్కువ ధరకే  'ప్రీ-ఓన్డ్, సర్టిఫైడ్  ఫోన్ల విక్రయం ద్వారా మార్కెట్ వాటాను విస్తరించుకునేందుక ప్రయత్నిస్తోంది.  తాజా సమాచారం ప్రకారం ఈ కథ ముగిసినట్టు తెలుస్తోంది. కానీ భారతదేశంలో స్థానిక తయారీపై ప్రదానంగా దృష్టి పెడుతోందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని  సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు వెల్లడించారు. అయితే  ఈ వార్తలపై ఆపిల్‌ అధికారికంగా   స్పందించాల్సి ఉంది.   ( Google Pixel 6a: ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌, గూగుల్‌పిక్సెల్‌ ఫోన్‌పై భారీ తగ్గింపు)

సెకండ్‌ హ్యాండ్‌ పరికరాల దిగుమతికి ఆపిల్‌ను అనుమతించడం అంటే ఇతర కంపెనీలు ఉపయోగించిన ఫోన్‌లను భారతదేశంలోకి డంపింగ్‌కు , తద్వారా భారీ ఇ-వ్యర్థాలకు దారితీయవచ్చని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.  కొత్తది అయినా, పాతదయినా  ఐఫోన్‌  అప్‌గ్రేడ్ అయ్యే అవకాశాలు  మెండుగా ఉన్న నేపథ్యంలో పాత ఫోన్ విక్రయాలతో తన మార్కెట్ వాటాను విస్తరించాలని ఆపిల్‌ లక్ష్యంగా పెట్టుకుందని ఐడీసీ ప్రతినిధి నవకేందర్ సింగ్ అభిప్రాయపడ్డారు. భారతదేశంలో స్థానికంగా  గ్లోబల్ కాంట్రాక్ట్ తయారీదారులు ఫాక్స్‌కాన్, విస్ట్రాన్, పెగాట్రాన్  భాగస్వామ్యంతో ఐఫోన్లను తయారుచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాటా టాటా గ్రూపు  విస్ట్రాన్‌తో చర్చలు జరపుతోంది. పరిశోధనా సంస్థ టెక్‌ఆర్క్ ప్రకారం, 2022లో దేశంలో దాదాపు 7 మిలియన్ల ఐఫోన్‌లు విక్రయించనుందని అంచనా.
 

మరిన్ని వార్తలు