ఐఫోన్‌లో బగ్ గుర్తిస్తే రూ.11 కోట్లు

24 Dec, 2020 15:50 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆపిల్ తన ఐఫోన్‌లు సెక్యూరిటీ, ప్రైవసీ పరంగా మరింత సురక్షితంగా ఉండేవిదంగా సెక్యూరిటీ రీసెర్చ్ డివైస్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించినట్లు ఆపిల్ గతంలో ప్రకటించింది. ఇప్పుడు ఆ సెక్యూరిటీ రీసెర్చ్ డివైస్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఇండిపెండెంట్ భద్రతా పరిశోధకులకు ఆపిల్ ప్రత్యేక ఐఫోన్ యూనిట్లను పంపనున్నట్లు తెలిపింది. ఈ ఐఫోన్‌లు హ్యాకింగ్ చేయడానికి సులువుగా ఉంటాయని పేర్కొంది. ఈ రోజు వరకు ఈ ప్రత్యేక ఐఫోన్‌లను స్వీకరించిన పరిశోధకులు కంపెనీ నియమ నిబంధనలు ప్రకారం నడుచుకోవాలని సూచించింది.(చదవండి: పబ్జి గ్లోబల్ వెర్షన్ లో సరికొత్త ఫీచర్స్)

వినియోగదారులకు భద్రతను పెంచే లక్ష్యాన్ని సాధించడంలో భద్రతా పరిశోధకుల సహకారం సంస్థకు బాగా ఉపయోగపడుతుందని ఆపిల్ అభిప్రాయపడింది. ఇండిపెండెంట్ పరిశోధకులు ఆపిల్ తో కలిసి పని చేస్తునందుకు అభినందనలు తెలిపింది. పరిశోధకులకు లభించిన ఐఫోన్‌లు వినియోగదారుల ఐఫోన్‌లతో పోలిస్తే సెక్యూరిటీ తక్కువగా ఉంటుందని పేర్కొంది. దీనివల్ల పరిశోధకులు తీవ్రమైన భద్రతా లోపాలను సులభంగా గుర్తించవచ్చు అని పేర్కొంది. హార్డ్‌వేర్ పరంగా మాత్రం యూజర్ల ఫోన్లకు సమానంగా ఉంటుంది అని సంస్థ పేర్కొంది.

పరిశోధకులు పరిశోధన చేయడానికి ఫోన్‌లను జైల్బ్రేక్ చేయనవసరం లేదు అని తెలిపింది. వారు సులువుగా ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ని పరీక్షించే విదంగా ప్రత్యేకంగా ఫోన్లను రూపొందించినట్లు పేర్కొంది. ప్రోగ్రామ్ పాల్గొనేవారికి విస్తృతమైన డాక్యుమెంటేషన్, సహకార కోసం ఆపిల్ ఇంజనీర్లతో ప్రత్యేక ఫోరమ్ యాక్సెస్ ఉంటుంది. సెక్యూరిటీ రీసెర్చ్ డివైస్ ప్రోగ్రామ్ బగ్ బౌంటీ ప్రోగ్రామ్‌తో పాటు నడుస్తుంది, కాబట్టి పెద్ద బగ్ ని గుర్తించే పరిశోధకులు 1.5 మిలియన్ల డాలర్లు(సుమారు రూ.11 కోట్లు) వరకు నగదు బహుమతిని పొందవచ్చు అని సంస్థ పేర్కొంది.

మరిన్ని వార్తలు