ముంచుకొస్తున్న ఆర్ధిక మాంద్యం..యాపిల్‌ కీలక నిర్ణయం

15 Nov, 2022 17:18 IST|Sakshi

ప్రపంచ వ్యాప్తంగా తలెత్తిన ఆర్ధిక మాంద్యం దెబ్బకు దిగ్గజ కంపెనీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఆర్ధిక మాంద్యం ముంచుకొస్తుందనే భయాలతో సంస్థలు ఉద్యోగులకు చెల్లించే జీతాల నుంచి వారికి అందించే లంచ్‌ వంటి ఇతర సదుపాయాల్లో కోత విధిస్తున్నాయి. తాజాగా టెక్‌ దిగ్గజం యాపిల్‌ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. నియామకాల్ని నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థ సీఈవో టిమ్‌ కుక్‌ తెలిపారు. 

ఆర్ధిక మాంద్యం కారణంగా అన్నీ దిగ్గజ సంస్థలు నియామకాల్ని నిలిపివేశాయి.యాపిల్‌ సంస్థ సైతం నియామాకల నిలుపుదలపై దృష్టి సారించిందని టిమ్‌కుక్‌ మీడియా ఇంటర్వ్యూలో వెల్లడించారు. 

ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా ప్రపంచవ్యాప్తంగా 11,000 ఉద్యోగాలను తగ్గించింది. యాపిల్‌ కాకుండా గూగుల్‌, నెట్‌ ఫ్లిక్స్‌ వంటి సంస్థలు నియామకాల్ని నిలిపివేశాయి. ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగించాయి. ఎలాన్‌ మస్క్‌ కొనుగోలు తర్వాత ట్విటర్‌లో రెండు వారాల్లో సుమారు 5,000 మంది ఉద్యోగులను ఫైర్‌ చేశారు.అదే తరహాలో తొలగింపులు లేకపోయినా, నియామకాలు నిలిపివేస్తున్నట్లు టిమ్‌కుక్‌ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు