చైనాలో కాదు చెన్నైలో

24 Jul, 2020 15:12 IST|Sakshi

చెన్నైలో ఆపిల్‌ ఐఫోన్‌ 11 తయారీ

సాక్షి, చెన్నై: ఆపిల్‌ ఐఫోన్‌ లవర్స్‌కు గుడ్‌న్యూస్‌. గతం కంటే తక్కువ ధరకే ఐఫోన్లు భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. తన ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ ఐఫోన్ 11ను చెన్నైలోని ఫాక్స్‌కాన్‌ ప్లాంట్లో తయారు చేయడం ప్రారంభించింది. ఆపిల్ ఐఫోన్11ను తొలిసారిగా  దేశీయంగా ఉత్పత్తి చేయనుంది. ఆపిల్ ఐఫోన్‌ల దేశీయంగా తయారు చేయడం ప్రయోజనకరంగా ఉండనుంది.

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం ట్విటర్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు. దేశంలో మేకిన్‌ ఇండియాలో ఇదో కీలకమైన పురోగతి అని ఆయన పేర్కొన్నారు. ఆపిల్ భారతదేశంలో ఐఫోన్ 11 తయారీని ప్రారంభించింది. దేశంలో మొట్టమొదటిసారిగా టాప్-ఆఫ్-ది-లైన్ మోడల్‌ను తీసుకువస్తోందని ఆయన ట్వీట్‌ చేశారు. ఐఫోన్ ఎక్స్‌ఆర్  స్మార్ట్‌పోన్‌ అసెంబ్లింగ్‌  ప్రారంభించిన తొమ్మిది నెలల తర్వాత ఈ కొత్త పరిణామం చోటు చేసుకుంది. మేడ్ ఇన్ ఇండియా యూనిట్లతో పోలిస్తే దిగుమతి చేసుకున్న స్మార్ట్‌ఫోన్‌లపై 20 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీంతో చెన్నైలో  తయారయ్యే ఐఫోన్ల ధరలు త్వరలో దిగి రానున్నాయి. 

కాగా భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఆపిల్ స్మార్ట్‌ఫోన్‌లలో ఐఫోన్11 కూడా ఒకటి. మరోవైపు ఐఫోన్‌ ఎస్‌ఈ 2020ని బెంగళూరు సమీపంలోని విస్ట్రాన్ ప్లాంట్‌లో తయారు చేయాలని ఆపిల్ యోచిస్తోంది. 2017లో,  ఆపిల్ ఐఫోన్ ఎస్‌ఈ 2016 దేశీయ తయారీని బెంగళూరు ప్లాంట్‌లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు