Apple : సెప్టెంబర్‌ 14నే ఐఫోన్‌-13 రిలీజ్‌..! కారణం​ అదేనా..!

11 Sep, 2021 16:17 IST|Sakshi

Is Apple Superstitious?: మొబైల్‌ లవర్స్‌ ఎంతో ఆసక్తి ఎదురు చూస్తోన్న ఐఫోన్‌-13 సిరీస్‌ ఫోన్లను ఆపిల్‌ సంస్థ సెప్టెంబర్‌ 14 న కాలిఫోర్నియా వేదికగా రిలీజ్‌ చేయనుంది. ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్‌-13 సిరీస్‌ ఫోన్ల కోసం ఆపిల్‌ మొబైల్స్‌ ప్రియులు కళ్లలో వత్తులువేసుకొని కూర్చున్నారు. ఇక ఈ మొబైల్‌ లాంచింగ్‌ విడుదలను వీక్షించేందుకు ఈవెంట్‌ను కూడా ఆ సంస్థ ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాలు చేసింది.

అయితే, ఆపిల్‌కు ఇక్కడో విచిత్రమైన సమస్య ఎదురైంది. ఆపిల్‌ సంస్థ మూఢ నమ్మకాలను నమ్ముతోందని సోషల్‌ మీడియాలో ప్రచారం మొదలైంది. ఐఫోన్‌-13 సిరీస్‌ మొబైల్స్‌ను సెప్టెంబర్‌ 14న లాంచ్‌ చేయడమే దీనికి కారణం. ఎటువంటి మూఢకాలను నమ్మని నేపథ్యంలో ఐఫోన్‌-13 సిరీస్‌ మొబైల్స్‌ను సెప్టెంబర్‌14 కు బదులు 13 వ తేదీన విడుదల చేయొచ్చు కదా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ట్విటర్‌లో #iPhone14 పేరిట హాష్‌టాగ్‌ ట్రెండ్‌ చేస్తున్నారు. 

 చదవండి: అగ్రరాజ్యాలను వెనక్కినెట్టి సరికొత్త రికార్డు సృష్టించిన భారత్‌..!

వచ్చిందంతా పదమూడు నంబర్‌తోనే..!
అనేక పాశ్చాత్యదేశాల్లో పదమూడో నంబర్‌ను దురదృష్టసంఖ్యగా భావిస్తారు. ఈ సంఖ్య ఒక గుడ్డి మూఢనమ్మకంగా ఆయా దేశాల్లోని​ ప్రజల్లో ఉండిపోయింది. పదమూడో నంబర్‌ ఆయా ప్రజలు ఎంతగా గుడ్డిగా నమ్ముతారో అనేదానికి అనేక ఉదాహరణలు మన ముందు ఉన్నాయి.  ఉదాహరణకు, స్ట్రెస్ మేనేజ్‌మెంట్ సెంటర్ ఫోబియా ఇనిస్టిట్యూట్ అంచనా ప్రకారం  700 నుంచి 800 మిలియన్ డాలర్లు ప్రతి శుక్రవారం 13 వ ఆయా దేశాల స్టాక్‌ఎక్సేచేంజ్‌ మార్కెట్‌లో కోల్పోతారు. ఇదిలా ఉండగా కొన్ని హోటళ్లు 13 వ నంబర్‌ ఫ్లోర్‌ను దాటవేస్తారు. కొన్ని విమాన సంస్థలు పదమూడో నంబర్‌ను పూర్తిగా తీసివేస్తాయి. తాజాగా నెటిజన్లు ఐఫోన్‌-13 నంబర్‌ సిరీస్‌ నంబర్‌ మొబైల్‌ కొన్నవారిపై, ఆపిల్‌ కంపెనీ దుష్ప్రభావాలు చూపుతోందని ట్విటర్‌లో ట్రెండ్‌ చేస్తున్నారు. 

మూఢనమ్మకాలకు స్వస్తి చెప్పుతూ..
నేటి టెక్నాలజీ యుగంలో మూఢనమ్మకాలకు తావు ఇవ్వకుండా ఆపిల్‌ తన పనిని తాను చేసుకుంటుంది. ప్రజల్లోని​ మూఢనమ్మకాలకు స్వస్తి పలకాలనే ఉద్ధేశ్యంతో ఐఫోన్‌-13 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను కంపెనీ రిలీజ్‌ చేయనుంది. ఆపిల్‌కు ఈ విచిత్రమైన పరిస్ధితి ఇప్పుడు వచ్చిందంటే పొరపడినట్లే ..! 2010లో ఆపిల్‌ ఐఫోన్‌-4 విడుదలకు ముందుకూడా ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొంది. నాలుగో నంబర్‌ను చైనా, కొన్ని ఆసియా దేశాల్లో మరణానికి సూచకంగా భావిస్తారు. ఒక నివేదిక ప్రకారం ఐఫోన్-4 అమ్మకాలు భారీగా జరిగాయి. ఐఫోన్‌-4 రిలీజైనా కొన్ని గంటలకే ఫోన్లన్ని అమ్ముడయ్యాయి. ఇదిలాఉండగా కొన్ని దిగ్గజ కంపెనీలు కెనాన్‌, నోకియా మాత్రం మూఢనమ్మకాలకు బలం చేకూర్చేలా నాలుగో నంబర్‌ను స్కిప్‌ చేస్తూ గాడ్జెట్స్‌ను మార్కెట్‌లోకి వదిలాయి. 

చదవండి: Google Photos: మీ స్మార్ట్‌ఫోన్లలో డిలీటైనా ఫోటోలను ఇలా పొందండి...!

మరిన్ని వార్తలు