భారత్‌లో ఐఫోన్‌ల తయారీని నిలిపివేయనున్న విస్ట్రాన్‌.. లాభాలు లేక మూసివేత?

23 May, 2023 16:12 IST|Sakshi

భారత్‌లో ఐఫోన్‌ల తయారీ సంస్థ విస్ట్రాన్‌ షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లాభాల్ని గడించే విషయంలో విస్ట్రాన్‌ అసంతృప్తిగా ఉంది. కాబట్టే వచ్చే ఏడాది నాటికి దేశీయంగా మ్యానిఫ్యాక్చరింగ్‌ యూనిట్లలో ఐఫోన్‌ల తయారీని దశల వారీగా నిలిపి వేయనుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అయితే, ఈ అంశంపై విస్ట్రాన్‌ యాజమాన్యం అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. 

ఎకనమిక్ టైమ్స్ కథనం ప్రకారం.. విస్ట్రాన్‌ భారత్‌లో అనుకున్నంత స్థాయిలో దీర్ఘకాలిక లాభాల్ని గడించడంలో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఆ ఇబ్బందుల నుంచి బయటపడేలా వియాత్నం, మెక్సికో వంటి దేశాల్లో లాభదాయకమైన టెక్నాలజీ  తయారీ సంబంధిత ప్రొడక్ట్‌లపై దృష్టి సారించినట్లు సమాచారం. 

ఐఫోన్‌తో జరిపిన చర్చలు విఫలం
ఇక, ఐఫోన్‌ల తయారీ నిలిపివేతపై విస్ట్రాన్‌ ఎగ్జిక్యూటీవ్‌లు కీలక వ్యాఖ్యలు చేశారంటూ రిపోర్ట్‌లు పేర్కొన్నాయి. భారత్‌లో యాపిల్‌ చేస్తున్న బిజినెస్‌లో ప్రాఫిట్స్‌ రావడం లేదని, ఎక్కువ లాభాలు వచ్చేలా యాపిల్‌ సంస్థతో జరిపిన చర్చలు విఫలమైనట్లు హైలెట్‌ చేశాయి. అయితే అంతర్జాతీయ తయారీ సంస్థలైన ఫాక్స్‌కాన్‌, పెగాట్రాన్స్‌ స్థాయిలో విస్ట్రాన్‌ ఆదాయాన్ని అర్జించడంలో ఇబ్బందులు పడుతుందని సమాచారం. 

చదవండి👉 ఐఫోన్ 14పై స్టీవ్ జాబ్స్ కూతురు.. ఇది కూడా ఎగతాళేనా?

విస్ట్రాన్ భారత్‌లో యాపిల్‌ కోసం ఐఫోన్‌ ఎస్‌ఈలను తయారు చేయడమే కాదు..ఇన్వెంటరీ మేనేజ్మెంట్‌ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. అంటే ఐఫోన్‌ల తయారీ, స్టోరేజ్‌ నిర్వహణ, అమ్మకాలు జరుపుతుంది. అయినప్పటికీ ఫ్రాఫిట్స్‌ పొందే విషయంలో ఇబ్బందులు పడుతుంది. వ్యాపారాన్ని మరింత విస్తరించలేకపోతుంది. 

వేధిస్తున్న అట్రిషన్‌ రేటు
ఇంకా, కర్ణాటకలోని కోలార్‌ జిల్లా, అచ్చటనహళ్లి గ్రామ పారిశ్రామక వాడలో ఉన్న విస్ట్రాన్‌ తయారీ యూనిట్‌లో ఉద్యోగులు స్థిరంగా ఉండటం లేదు. అధిక వేతనం కోసం ఇతర సంస్థల్లో చేరుతున్న సిబ్బంది సంఖ్య ఎక్కువగా ఉంది. నివేదిక ప్రకారం.. చైనా - భారత్‌ల మధ్య వర్క్‌ కల్చర్‌ విషయంలో కంపెనీ అనేక సవాళ్లు విస్ట్రాన్‌ ఐఫోన్‌ తయారీ నిలిపివేయడానికి దోహదపడ్డాయి. ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించకపోవడంతో అట్రిషన్‌ రేట్‌ పెరిగేందుకు దారి తీసింది. 

ఐఫోన్‌ 15 తయారు చేయనున్న టాటా!
సంస్థ పునర్నిర్మాణంలో భాగంగా, విస్ట్రాన్‌ తన ఐఫోన్‌ల తయారీని టాటా గ్రూప్‌కు విక్రయిస్తోంది. ట్రెండ్‌ ఫోర్స్‌ రిపోర్ట్‌ సైతం టాటా గ్రూప్ భారత్‌లో విడుదల కానున్న ఐఫోన్‌ 15 మోడళ్లను తయారు చేసేందుకు ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపింది.

చివరిగా.. 2008లో పర్సనల్‌ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, సర్వర్‌లతో సహా ఇతర సేవల్ని అందించేలా విస్ట్రాన్‌ భారతీయ మార్కెట్లో అడుగు పెట్టింది. 2017లో, కంపెనీ తన కార్యకలాపాలను విస్తరించి యాపిల్‌ కోసం ఐఫోన్‌లను తయారు చేయడం ప్రారంభించింది.

చదవండి👉‘మాధురీ మేడం వడపావ్‌ అదిరింది’.. యాపిల్‌ సీఈవో టిమ్‌కుక్‌ వైరల్‌

మరిన్ని వార్తలు