యాపిల్‌ యూజర్లకు హెచ్చరిక.. అర్జెంట్‌గా అప్‌డేట్‌ చేస్కోవాల్సిన మోడల్స్‌ ఇవే!

2 Aug, 2021 11:09 IST|Sakshi

భారత్‌లో యాపిల్‌ డివైజ్‌ల యూజర్లకు అలర్ట్‌ జారీ అయ్యింది. వెంటనే ఐఫోన్లను, ఐప్యాడ్‌లను వీలైనంత త్వరగా అప్‌డేట్‌ చేసుకోవాలని సూచనలు అందాయి. ఈ మేరకు ఐటీ సెక్యూరిటీ ఆర్గనైజేషన్‌ విభాగం సీఈఆర్‌టీ-ఇన్‌(Indian Computer Emergency Response Team) తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. 

ఐవోఎస్‌ 14.7.1, ఐప్యాడ్‌ 14.7.1 వారం కిందట రిలీజ్‌ అయ్యాయి. వీటికి సంక్లిష్టమైన మెమరీ కరప్షన్‌ బగ్‌ను ఫిక్స్‌ చేసే సామర్థ్యం ఉంది.  కాబట్టి, వెంటనే ఆ వెర్షన్‌లకు అప్‌డేట్‌ చేసుకోవాలని యాపిల్‌ యూజర్లకు సూచించింది. మెమరీ కరప్షన్‌ ఇష్యూస్‌ ఉ‍న్నందున అప్‌డేట్‌ చేసుకోమని తెలిపింది. ‘హ్యాకర్లు పాత అప్‌డేట్‌ ఉన్న ఐఫోన్లలో కోడింగ్‌ను హ్యాక్‌ చేసి.. రిమోట్‌ యాక్సెస్‌ చేసే ప్రమాదం ఉంద’ని పేర్కొంది. వీటితో పాటు మాక్‌ యూజర్లు(డెస్క్‌టాప్‌ వెర్షన్‌) యూజర్లు కూడా సాప్ట్‌వేర్‌ అప్‌డేట్‌ చేసుకుంటే మంచిదని సూచించింది.
సెట్టింగ్స్‌ ఓపెన్‌ చేయాలి.. జనరల్‌ను క్లిక్‌ చేయాలి.. సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ చేసుకోవాలి

అప్‌డేట్‌ వేటికంటే..  ఐఫోన్‌ 6ఎస్‌, ఆ తర్వాత వచ్చిన మోడల్స్‌, ఐప్యాడ్‌ ప్రో మోడల్స్‌ అన్నీ, ఐప్యాడ్‌ ఎయిర్‌ 2 ఆ తర్వాత వచ్చిన మోడల్స్‌, ఐప్యాడ్‌ ఫిఫ్త్‌ జనరేషన్‌-ఆ తర్వాత వచ్చిన డివైజ్‌లు, ఐప్యాడ్‌ మినీ 4-తర్వాతి మోడల్స్‌, ఐప్యాడ్‌ టచ్‌(సెవెన్త్‌జనరేషన్‌), మోస్ట్‌ అడ్వాన్స్‌డ్‌ మాక్‌ఓస్‌ బిగ్‌ సర్‌ డివైజ్‌లను అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది. 

మరిన్ని వార్తలు