Apple Warns Users: యాపిల్‌ వార్నింగ్‌:సెక్యూరిటీ లోపం, తక్షణమే అప్‌డేట్‌ చేసుకోండి! 

19 Aug, 2022 21:10 IST|Sakshi

ముంబై: టెక్‌​ దిగ్గజం యాపిల్‌ సెక్యూరిటీ లోపాలపై తన యూజర్లకు హెచ్చరిక జారీ చేసింది. తన  ఉత్పత్తులు ఐఫోన్‌లు, ఐప్యాడ్‌, మ్యాక్‌లకు సంబంధించి హ్యాకర్లు దాడిచేసి అవకాశం ఉందని సూచించింది. వెంటనే అప్‌డేట్‌ చేసుకోవాలని వినియోగదారులను కోరింది. iPhone6S, తదుపరి మోడల్స్‌; ఐప్యాడ్  5వ తరంతో పాటు, అన్ని ఐప్యాడ్ ప్రో మోడల్స్‌, ఐప్యాడ్ ఎయిర్ 2; మ్యాక్‌ కంప్యూటర్లు macOS Montereyలను ప్రభావితం చేస్తుందని సెక్యూరిటీ నిపుణులు కూడా హెచ్చరించారు.

దీనిపై బుధవారం రెండు భద్రతా నివేదికలను యాపిల్‌ విడుదల చేసింది. ఐఫోన్‌లు, ఐప్యాడ్‌లు, మాక్‌ల భద్రతాలోపాన్ని వెల్లడించిన యాపిల్‌ ఆయా పరికరాలపై హ్యాకర్లు పూర్తి పట్టు సాధించే అవకాశం ఉందంటూ పేర్కొంది. వీలైనంత త్వరగా ఆయా డివైస్‌లలో ఈ కొత్త ప్యాచ్ అప్‌డేట్ చేసుకోవాలని,లేదంటేసైబర్‌ నేరగాళ్లు సిస్టమ్‌లోకి ప్రవేశించి విలువైన డేటాను యాక్సస్ చేయవచ్చు. అన్ని డివైస్‌లలో ప్యాచ్డ్ వెర్షన్‌ అందుబాటులో ఉంటుందని తెలిపింది. అయితే ఎక్కడ, ఎవరి ద్వారా లోపాన్ని గుర్తించిందీ  యాపిల్‌ స్పష్టం  చేయలేదు. 

అటు భద్రతా నిపుణులు ప్రభావితమైన పరికరాలను అప్‌డేట్ చేసుకోవాలని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చొరబాటుదారులు అసలు ఓనర్‌గా నటించి, వారి పేరుతో ఏదైనా సాఫ్ట్‌వేర్‌ను యాక్సెస్‌ చేసే అవకాశం  ఉందని సోషల్ ప్రూఫ్ సెక్యూరిటీ  సీఈవో రేచెల్ టొబాక్ తెలిపారు.

మరిన్ని వార్తలు