వావ్‌..కంగ్రాట్స్‌ మేడమ్‌.. మీరు గర్భవతి అయ్యారు!!

10 Oct, 2022 12:36 IST|Sakshi

ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌ విడుదల చేసిన స్మార్ట్‌ వాచ్‌ల పనితీరు చర్చాంశనీయమయ్యాయి. ఇప్పటికే పలు ప్రమాదాల నుంచి యూజర్లను సురక్షితంగా రక్షించిన యాపిల్‌ వాచ్‌లు.. తాజాగా ఓ మహిళ గర్భం దాల్చిన విషయాన్ని తనకు ముందే గుర్తు చేశాయి.  

యాపిల్‌ వాచ్‌లో హార్ట్‌ మానిటరింగ్‌, ఈసీజీ, ఆక్సిమీటర్‌తో పాటు ఆరోగ్యపరమైన ఫీచర్లు ఉన్నాయి. కాబట్టే వినియోగదారులు హెల్త్‌ పరమైన సమస్యల్ని ముందే గుర్తించేందుకు ఆ సంస్థ వాచ్‌లను ధరిస్తుంటారు. అయితే తాజాగా యాపిల్‌ వాచ్‌ ధరించిన ఓ మహిళకు..ప్రెగ్నెన్సీ కన్ఫామ్‌ అయ్యిందని, త్వరలో డాక్టర్‌ను సంప్రదించాలంటూ ఆలెర్ట్‌లు (హార్ట్‌బీట్‌) పంపించడం ఆసక్తికరంగా మారింది. 

రెడ్డిట్ ప్రకారం.. 34ఏళ్ల మహిళ యాపిల్‌ వాచ్‌ను ధరించింది. ఈ తరుణంలో వాచ్‌ ధరించిన కొన్ని రోజుల తర్వాత ఆమె హార్ట్‌ బీట్‌లో పెరిగింది. సాధారణంగా ‘నా హార్ట్‌ రేటు 57 ఉండగా..అది కాస్తా 72కి పెరిగింది. వాస్తవంగా హార్ట్‌ రేటు గత 15 రోజులుగా ఎక్కువగా ఉన్నట్లు యాపిల్‌ వాచ్‌ హెచ‍్చరించింది. ఓ వ్యక్తి హార్ట్‌ రేటు పెరగడానికి అనేక కారణాలుంటాయి. అందుకే అనుమానం వచ్చి కోవిడ్‌ టెస్ట్‌ చేయించుకున్నా. అందులో నెగిటీవ్‌ వచ్చింది.’ 

అదే సమయంలో గర్భం దాల్చిన మొదటి వారాల్లో మహిళ హార్ట్‌ బీట్‌ పెరుగుతుందని, ఇదే విషయాన్నితాను హెల్త్‌ జర్నల్‌లో చదివినట్లు పోస్ట్‌లో పేర్కొంది. తర్వాత తాను ప్రెగ్నెన్సీ కోసం టెస్ట్‌కు వెళ్లగా..డాక్టర్లు వైద్య పరీక్షలు చేసి నాలుగు వారాల గర్బణీ అని నిర్ధారించినట్లు చెప్పారని తెలిపింది.

హార్ట్‌ రేట్‌ : గర్భం దాల్చిన మహిళల హార్ట్‌ రేటు నిమిషానికి 70 నుంచి 90 వరకు కొట్టుకుంటుంది

చదవండి👉 స్మార్ట్‌ వాచ్‌ను విసిరి కొట్టాలనుకుంది..కానీ అదే ఆ యువతి ప్రాణాల్ని కాపాడింది!

మరిన్ని వార్తలు